ఏపీలో బీజేపీ అధికారికంగా జనసేన( JanaSena Party ) పొత్తులో ఉందనే సంగతి అందరికీ తెలిసిందే.
అయితే టీడీపీ, వైసీపీ పార్టీలు కూడా బీజేపీతో దోస్తీని కోరుకుంటున్నాయి.
టీడీపీ విషయంలో బీజేపీ కొంత దూరంగానే ఉంటూ వచ్చినప్పటికి వైసీపీ విషయంలో మాత్రం కేంద్ర బీజేపీ కొంత సానుకూలంగా కొంత వ్యతిరేకంగా మెలుగుతూ వస్తోంది.క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం వైసీపీకి అండగా నిలుస్తూ రావడం, సకాలంలో నిధులు విడుదల చేయడం వంటి పరిణామాలతో బీజేపీ మరియు వైసీపీ మద్య అంతర్గత పొత్తు ఉందనే భావనా అందరిలోనూ కలిగింది.
అయితే ఇలాంటి వార్తలతో నష్టం చేరుకే అవకాశం ఉందని గ్రహించిన బీజేపీ( BJP party ) ఆగ్రనాయకత్వం ఆ వెంటనే వైసీపీ సర్కార్ పై జగన్ ( CM jagan )పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం ప్రారంభించింది.అటు జగన్ కూడా బీజేపీ తమతో లేదని క్లారిటీ ఇచ్చారు.ఇక ఆ తరువాత ఎన్డీయే మిత్రా పక్షాలతో నిర్వహించిన సమావేశానికి కూడా వైసీపీ అటెండ్ కాకపోవడంతో దాదాపు ఈ రెండు పార్టీల స్నేహబంధం చెడిందనే భావించారంతా.
కానీ అబ్బే అలాంటిదేమీ లేదని.వైసీపీ ఎప్పుడు బీజేపీ వెంటేనని మరోసారి రుజువైంది.తాజాగా లోక్ సభలో విపక్షాలన్నీ ఏకమై మణిపూర్ విషయంలో మోడి సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు.
ఈ తీర్మానానికి వైసీపీ దూరంగా ఉంటుందని.ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి( Vijay Sai Reddy ) ఇటీవల చెప్పుకొచ్చారు.మోడి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టవలసిన అవసరం లేదని.
తాము మోడి సర్కార్ కు మద్దతుగా నిలుస్తామని ఆయన చెప్పుకొచ్చారు.దీంతో వైసీపీ మళ్ళీ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.అందువల్ల బీజేపీతో స్నేహబంధాన్ని దూరం చేసుకునేందుకు వైసీపీ సిద్దంగా లేదని మరోసారి స్పష్టమైంది.
మరి పొత్తు కానీ పొత్తుతో స్నేహబంధాన్ని కొనసాగిస్తున్న ఈ రెండు పార్టీల మద్య బంధం ఎంతవరుకు వెళుతుందో చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy