టీడీపీ అక్కడ.. వైసీపీ ఇక్కడ ?

ఏపీలో టీడీపీ వైసీపీ మద్య రాజకీయ రగడ ఏ స్థాయిలో ఉంటుందో పత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

ఇంకా ఎన్నికల సమయంలో అది కాస్త రెట్టింపు అవుతుంది.

ప్రస్తుతం ఈ రెండు పార్టీలు అధికారంపై గట్టిగా కన్నెశాయి.అయితే ఈసారి గెలుపును ప్రత్యర్థి కంచుకోటల నుంచే స్టార్ట్ చేయాలని రెండు పార్టీలు ఒకే వ్యూహంతో ఉన్నాయి.

కుప్పంలో చంద్రబాబు( Chandrababu Naidu ) ను ఓడించాలని జగన్( YS Jagan Mohan Reddy ) ప్రయత్నిస్తుంటే.పులివెందులలో జగన్ జోరుకు బ్రేకులు వేయాలని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు.

అయితే ఈ కుండ మార్పిడి రగడ కేవలం అధినేతల వరకే పరిమితం కాలేదు.ఆయా జిల్లాలపై కూడా అధినేతలు సేమ్ స్ట్రాటజీతో ఉన్నారు.

Ycp Targeting Tdp Seats, Chandrababu Naidu , Ycp , Tdp , Kuppam , Nellore, Kurn
Advertisement
YCP Targeting TDP Seats, Chandrababu Naidu , YCP , TDP , Kuppam , Nellore, Kurn

టీడీపీ బలంగా ఉన్న జిల్లాలపై వైసీపీ ఫోకస్ చేస్తుంటే.ఇటు వైసీపీ బలంగా ఉన్న జిల్లాలపై టీడీపీ( TDP ) గురి పెట్టింది.ముఖ్యంగా ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా ఉన్నకృష్ణా జిల్లా మరియు అనంతపురం జిల్లాలపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది.

గత ఎన్నికల్లో కృష్ణా జిల్లాలోని మొత్తం 16 స్థానాలకు గాను 14 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది.ఈసారి ఆ రెండు స్థానాలను కూడా గెలుచుకొని జిల్లాలో అన్నీ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయాలని అధినేత జగన్ భావిస్తున్నారు.

ఇక అనంతపురంలోని 9 స్థానాలకు గాను గత ఎన్నికల్లో వైసీపీ 7 స్థానాలను గెలుచుకుంది.

Ycp Targeting Tdp Seats, Chandrababu Naidu , Ycp , Tdp , Kuppam , Nellore, Kurn

ఈసారి ఇక్కడ కూడా క్లీన్ స్వీప్ పై వైసీపీ కన్నెసింది.అటు చంద్రబాబు కూడా వైసీపీ బలంగా ఉన్న జిల్లాలపై ఫోకస్ పెట్టారు, నెల్లూరు, కర్నూల్, కడప వంటి జిల్లాల్లో ఈసారి వైసీపీకి షాక్ ఇవ్వాలని బాబు అస్త్రశాస్త్రాలు రచిస్తున్నారు.నెల్లూరులో ప్రస్తుతం ఆయా నేతల మద్య వున్న విభేదాల కారణంగా వైసీపీ కొంత బలహీన పడింది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

దీంతో ఈ సారి నెల్లూరు జిల్లాను హస్తగతం చేసుకోవాలని బాబు గట్టిగా ప్రయత్నిస్తున్నారు/.ఇక కర్నూల్ పై కూడా మెజారిటీ సీట్లను దగ్గించుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.

Advertisement

అటు వైసీపీ బలంగా ఉన్న జిల్లాలపై టీడీపీ.ఇటు టీడీపీ బలంగా ఉన్న జిల్లాలపై వైసీపీ గురిపెడుతుండడంతో ఎవరికి ఎవరు షాక్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.

తాజా వార్తలు