YCP Siddham : ‘సిద్ధం ‘ సభకు భారీగానే సిద్ధమవుతున్న వైసీపీ 

వరుసగా సిద్ధం( Siddham ) పేరుతో భారీ సభలను నిర్వహిస్తూ,  ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయిన అధికార పార్టీ వైసీపీ టిడిపి, జనసేన కూటమిని ఎదుర్కునేందుకు బలంగానే సిద్ధమవుతోంది.

బీజేపీ ఆ రెండు పార్టీలతో జత కలిసినా తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని , 2019 ఎన్నికల్లో వైసీపీ( YCP ) ప్రకటించిన మానిఫెస్టోను దాదాపు 99% పూర్తి చేసామని, ప్రజల్లో ప్రభుత్వ పాలనపై సంతృప్తి ఉందని , అదే తమను మళ్ళీ అధికార పీఠంపై కూర్చోబెడుతుందనే నమ్మకంతో వైసిపి అధినేత , ఏపీ సీఎం జగన్( AP CM YS Jagan ) ఉన్నారు.

అందుకే నియోజకవర్గాల వారీగా భారీగా ఇన్చార్జిలను మార్చారు .తనను చూసే జనాలు ఓటు వేస్తారని , అభ్యర్థులు ఎవరనేది పట్టించుకోరనే నమ్మకంతో జగన్ ఉన్నారు.ఇప్పటికే విడతల వారీగా సిద్ధం పేరుతో సభలను నిర్వహించారు.

ప్రకాశం జిల్లా బాపట్లలోని అద్దంకిలో వైసిపి సిద్ధం నాలుగో సభను నిర్వహించబోతోంది.

ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని సభల కంటే భారీగా ఈ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.మూడు విడతలుగా నిర్వహించిన ఈ సభలకు భారీగా కార్యకర్తలు,  నాయకులు హాజరు కావడంతో,  అంతకుమించి జనాలు హాజరయ్యే విధంగా అద్దంకి( Addanki ) సభను నిర్వహించాలని వైసిపి ప్లాన్ చేస్తుంది .దాదాపు 15 లక్షల మంది వైసీపీ మద్దతు దారులతో భారీ సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.బాపట్లలో సిద్ధం సభలో వైసిపి అధినేత , ఏపీ సీఎం జగన్ వైసిపి ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించబోతున్నారు. 

Advertisement

దీంతో ఈ సభను ఆ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది .ఇప్పటికే టిడిపి సూపర్ సిక్స్( TDP Super 6 ) పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన నేపథ్యంలో,  దానికి మించి ఉండేలా మరిన్ని జనాకర్షణ పథకాలను మేనఫెస్టోలో చేర్చేందుకు వైసిపి ప్లాన్ చేసుకుంటుంది.ఈ సభకు హాజరయ్యే వైసిపి మద్దతు దారుల ద్వారా,  తాము ఏ స్థాయిలో బలంగా ఉన్నామనేది జనాలకు, ప్రతిపక్షాలకు అర్థమయ్యేలా చేయడంతో పాటు,  ప్రతిపక్షాలకు వణుకు పుట్టించాలని వైసిపి ప్లాన్ చేసుకుంటోంది.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు