ఏపీలో ముందస్తు ఎన్నికలు( AP Early Elections ) వస్తాయని కొంతకాలంగా రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది.
జగన్ ( CM Jagan ) ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్పీడ్ పెంచారని, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అందుకే అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వార్నింగులు ఇస్తున్నారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి.
ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) ముందస్తు ఎన్నికల పై ఇప్పటికే అనేక ప్రకటనలు చేశారు.టిడిపి శ్రేణులంతా ముందస్తు ఎన్నికలను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని, ఖచ్చితంగా ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని పదేపదే చెబుతూనే వస్తున్నారు.
అయితే ఈ ముందస్తు ఎన్నికల ప్రకటనపై జగన్ తో పాటు, అనేక సందర్భాల్లో వైసీపీ కీలక నాయకులు స్పందించారు.ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని, సాధారణ ఎన్నికలే జరుగుతాయని చెబుతూనే వస్తున్నారు.ఎమ్మెల్యేల తో నిర్వహించిన సమావేశంలో జగన్ ఈ విషయంపై అనేక సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు.
తాజాగా వైసిపి నరసాపురం ఎంపీ రఘురాం కృష్ణంరాజు( Raghurama Krishnam Raju ) ఈ వ్యవహారంపై స్పందించారు.ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని , నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు జరగడం ఖాయమని, ప్రజలు అందుకు సిద్ధంగా ఉండాలంటూ రఘురామ కృష్ణంరాజు పిలుపునిచ్చారు.జగన్ తన మొఖం చూసే ప్రజలు ఓట్లు వేశారని , తన ఫోటో పెట్టుకుని ఎమ్మెల్యేలు గెలిచారని చెబుతున్నారని,
ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదు అనడం ఎంతవరకు కరెక్ట్ అంటూ రఘురాం ప్రశ్నించారు.శాసనమండలి, పట్టభద్రుల ఎన్నికల్లో పులివెందులలోని టిడిపి అభ్యర్థి రామగోపాల్ రెడ్డి కి అత్యధిక ఓట్లు వచ్చాయన్నారు.పులివెందులలో తమ పార్టీ పరిస్థితి పై వెంటనే సమీక్షించాలని టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పులివెందులలో పోటీ చేయాలని మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసరడం విడ్డూరంగా ఉందంటూ రఘురామ అన్నారు.
అసలు పులివెందులలో అధికార పార్టీని ఓడించేందుకు బీటెక్ రవి సరిపోతాడనే ధీమా లో ప్రతిపక్షం ఉందని రఘురామ అన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy