రేపు ఈడీ విచారణకు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి

ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రేపు ఈడీ విచారణకు హాజరుకానున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈనెల 18న ఈడీ విచారణకు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గైర్హాజరు అయ్యారు.బంధువులకు అనారోగ్యంతో విచారణకు హాజరుకాలేకపోయారన్న సంగతి తెలిసిందే.

కాగా ఇప్పటికే మాగుంట కుమారుడు రాఘవ రెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

Advertisement