పార్టీ మార్పు వార్తలను ఖండించిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు( AP Elections ) రాబోతున్నాయి.2024 ఎన్నికలను ప్రధాన పార్టీలు చాల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయబోతూ ఉంది.

విపక్షాలు జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కలిసి పోటీ చేయబోతున్నాయి.ఇంకా ఎన్నికలకు మూడు నెలలు మాత్రమే ఉండటంతో చాలామంది పార్టీలు మారుతూ ఉన్నారు.

ఇక ఇదే సమయంలో రకరకాల ప్రచారాలు కూడా కొంతమంది నాయకులపై జరుగుతున్నాయి.ఈ రకంగానే ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి.

( MP Magunta Srinivasulu Reddy ) టీడీపీలో జాయిన్ అవుతున్నట్లు ఇటీవల భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది.

Advertisement

దీంతో పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఖండించారు.తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని స్పష్టం చేశారు.ఇదే సమయంలో పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

వైసీపీలో నాకు ఇబ్బందులు ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు.అనుచరుల ఒత్తిడితో నేను తెలుగుదేశం పార్టీలో( TDP ) వెళ్తున్ననేది పూర్తి అవాస్తవం.

కొందరు కావాలని ఇలాంటి ప్రచారం చేయిస్తున్నారు.ఇలాంటి ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని ఎంపీ మాగుంట వార్నింగ్ ఇచ్చారు.

Shocking Facts About Money Plant I Mana Health
Advertisement

తాజా వార్తలు