గుడివాడలో టీడీపీకి అభ్యర్థి దొరుకుతాడో లేదో అంటున్న వైసీపీ మాజీమంత్రి..!!

నేడు గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ ప్లీనరీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నానితో పాటు పేర్ని నాని మరికొంతమంది కీలక వైసీపీ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.గుడివాడకి ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసిన నాయకుడు కొడాలి నాని అని తెలిపారు.

ఈ మధ్య చంద్రబాబు నాయుడు గుడివాడలో కొడాలి నానిని ఓడిస్తా అనే తరహాలో.వ్యవహరిస్తున్నారు.

అసలు ముందు గుడివాడలో టీడీపీకి అభ్యర్థి దొరుకుతాడో లేదో చూసుకోండి అంటూ.సెటైర్లు వేశారు.

Ycp Ex Minister Says Whether Tdp Will Get A Candidate In Gudivada Perni Nani, Ko
Advertisement
YCP EX Minister Says Whether TDP Will Get A Candidate In Gudivada Perni Nani, Ko

ఎన్నికలు అయిపోయి మూడు సంవత్సరాలు అయింది.మరో రెండు సంవత్సరాలలో మళ్లీ ఎన్నికలు వస్తాయి.ఎవరిని పోటీకి పెడతావో ఒక క్లారిటీ లేదు.

కానీ కొడాలి నాని గెలుపు గురించి ఓటమి గురించి.చంద్రబాబు ఆలోచిస్తే అసలు ఏమైనా అర్థం ఉందా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

గుడివాడలో ప్లీనరీ సమావేశంకి పోటీగా అంగళూరులో.మినీ మహానాడు పెట్టావు.

ఏమైంది అక్కడ మొత్తం రచ్చ రచ్చ అయింది.కొడాలి నానితో పెట్టుకుంటే అదే రీతిలో ఉంటుంది.

పెద్ద రకంగా రాజకీయాలు చేసుకుంటే బాగుంటుంది.కాని రీతిలో పోటీకి ఎటువంటి ఆలోచనలు లేకుండా.

Advertisement

కొడాలి నానితో పెట్టుకుంటే వచ్చే ఎన్నికలలో కూడా అదే జరుగుద్ది.అంటూ తనదైన శైలిలో పేర్ని నాని గుడివాడ వైసీపీ ప్లీనరీ సమావేశంలో స్పీచ్ ఇచ్చారు.

తాజా వార్తలు