మంత్రి పదవి వచ్చినా రోజాకు తప్పని కష్టాలు 

వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు పొందడం తోపాటు, జగన్ కు అత్యంత సన్నిహితురాలిగా పేరుపొందిన నగరి వైసిపి ఎమ్మెల్యే మంత్రి ఆర్కే రోజా  రాజకీయ పరిస్థితి పైకి బాగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నా, సొంత నియోజకవర్గంలో నగరిలో మాత్రం ఆమె తీవ్ర రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  అయితే ఈ ఇబ్బందులు ప్రత్యర్థి పార్టీల నుంచి కాదు.

సొంత పార్టీలోని అసమ్మతి వర్గం నాయకులు తరుచుగా రోజాకు ఇబ్బందులు తీసుకొచ్చే విధంగా వ్యవహారాలు చేస్తూ ఉండడం, ఆమెకు వ్యతిరేకంగా సొంతంగా కార్యక్రమాలు చేపడుతూ ఉండడం ఇవన్నీ ఎప్పటి నుంచో రోజాకు ఇబ్బందికరంగా మారాయి.జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండతో రోజా అసమతి వర్గం దూకుడుగా వ్యవహరిస్తున్నట్లుగా రోజా వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు.

వారికి సెట్ పెట్టే విధంగా రోజా ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటున్నారు.బహిరంగ సమావేశాలలోను సొంత పార్టీలోని అసమ్మతి నాయకులకు పరోక్షంగా హెచ్చరికలు చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు.

అయితే ఇటీవల రోజాకు మంత్రి పదవి దక్కడంతో అసమ్మతి నాయకులు సెట్ అవుతారని పూర్తిగా నియోజకవర్గంలో పరిస్థితులు తన ఆధీనంలోకి వస్తాయని ఆమె భావించినా, పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు.

Advertisement

గత ఎన్నికల్లో మొదలైన విభేదాలు పరిషత్, మునిసిపల్ ఎన్నికల్లోను బాగా కనిపించాయి.రోజాకు వ్యతిరేకంగా కేజే కుమార్ ,అమ్ములు, రెడ్డివారి చక్రపాణి రెడ్డి వంటి నేతలు యాక్టివ్ గా రోజాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి ఎటువంటి నామినేటెడ్ పదవులు ఇవ్వద్దంటూ రోజా అధిష్టానానికి చెప్పినా,  శ్రీశైలం ఆలయ చైర్మన్ పదవిని చక్రపాణి రెడ్డికి, భార్యకు మరో నామినేటెడ్ పోస్టును ఇచ్చారు.

ఇప్పుడు రోజా మంత్రేనా ఆమె వ్యతిరేక వర్గం బ్యానర్లు ఏర్పాటు చేసిన చోటే వీరూ ఏర్పాటు  చేస్తూ మరింత రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు.ఇటీవల నగర నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ ప్లీనరీకి రోజా వ్యతిరేక వర్గం హాజరు కాలేదు.

కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించిన చిత్తూరు జిల్లా ప్లీనరీ సమావేశానికి మాత్రం రోజా వ్యతిరేక వర్గం హాజరైంది.రోజా మంత్రిగా ఉన్న నగర నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా సొంత పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.

తాజా వార్తలు