వైసీపీ నేత అంబటి రాంబాబు పిటిషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు..!!

వైసీపీ నేత అంబటి రాంబాబు ( Ambati Rambabu ) సత్తేనపల్లి నియోజకవర్గంలో నాలుగు కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని పిటిషన్ దాఖలు చేశారు.

నిన్న హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయగా.

నేడు హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది.చంద్రగిరి( Chandragiri ) లోను రీపోలింగ్ జరపాలని వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి పిటిషన్ ను కూడా కోర్టు డిస్మిస్ చేయడం జరిగింది.

సత్తేనపల్లి నియోజకవర్గంలో 236, 237, 253, 254 వార్డులలో రీపోలింగ్ నిర్వహించాలని అంబటి రాంబాబు నిన్న హైకోర్టును ఆశ్రయించారు.ప్రతివాదులుగా ఈసీ, సీఈవో సహా ఐదు మందిని చేర్చడం జరిగింది.

ఈ పిటిషన్ ను నేడు ధర్మాసనం డిస్మిస్ చేయడం జరిగింది.

Advertisement

ఏపీలో పోలింగ్ రోజు నుండి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి.కొన్ని నియోజకవర్గాలలో పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు( Evms ) కూడా పగలగొట్టేశారు.వాటికి సంబంధించిన వీడియోలు కూడా ఇటీవల బయటపడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోలింగ్ టైంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.అయినా గాని ప్రజలు భారీ ఎత్తున పోలింగ్ లో పాల్గొన్నారు.80 శాతం కంటే ఎక్కువగానే పోలింగ్ నమోదయింది.దీంతో గెలుపు విషయంలో వైసీపీ మరియు తెలుగుదేశం కూటమి నేతలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరి జూన్ 4వ తారీఖు రాబోయే ఫలితాలలో ఎవరు గెలవనున్నారో తెలియనుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్24, ఆదివారం 2024
Advertisement

తాజా వార్తలు