యశస్వి జైస్వాల్ సంచలన ఇన్నింగ్స్.. ఎన్ని రికార్డులు బ్రేక్ చేశాడంటే..?

ఐపీఎల్ సీజన్( IPL season ) చివరి దశకు చేరుకుంటూ ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది.

ప్రతి జట్టు ప్లే ఆఫ్ కు చేరాలంటే మొదటి నాలుగు స్థానాలలో నిలవడమే ప్రధాన లక్ష్యం.

కాబట్టి జట్ల మధ్య పోరు ఉత్కంఠ భరితంగా సాగుతూ చివరి బంతి వరకు ఏ జట్టు గెలుస్తుందో ఊహించడం కష్టమైంది.ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న మ్యాచులు డూ ఆర్ డై అని చెప్పాలి.

తాజాగా రాజస్థాన్ - కోల్ కత్తా( Rajasthan - Kolkata ) మధ్య జరిగిన మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు ఉత్కంఠ భరితంగా సాగింది.ఇరు జట్ల బ్యాటర్లు పరుగుల వరద పారించారు.

ఇక రాజస్థాన్ జట్టు ఒకవైపు బ్యాటింగ్లో, మరో వైపు ఫీల్డింగ్ లో అదరగొట్టి ఘన విజయం సాధించింది.

Yashaswi Jaiswals Sensational Innings How Many Records Did He Break , Rajasthan
Advertisement
Yashaswi Jaiswal's Sensational Innings How Many Records Did He Break , Rajasthan

రాజస్థాన్ జట్టు మ్యాటర్ యశస్వి జైస్వాల్( Yashaswi Jaiswal ) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.బౌండరీల వర్షం కురిపించి రాజస్థాన్ జట్టుకు విజయాన్ని అందించాడు.47 బంతుల్లో 98 పరుగులు చేసి ఈ ఐపీఎల్ లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.ఈ ఇన్నింగ్స్ తో ఎన్నో రికార్డులు బ్రేక్ చేశాడు.

ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్ గా సరికొత్త రికార్డును యశస్వి జైస్వాల్ తన ఖాతాలో వేసుకున్నాడు.అంతేకాదు అత్యంత వేగంగా ఆప్షన్ చేసిన అతిపిన్న వయసు ఉన్న వ్యక్తిగా కూడా చరిత్ర సృష్టించాడు.

Yashaswi Jaiswals Sensational Innings How Many Records Did He Break , Rajasthan

ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్ లో 26 పరుగులు చేసిన బ్యాటర్ గా కూడా యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు.ఇంకా ఈ ఐపీఎల్ సీజన్లో 500 ప్లస్ పరుగులు చేసిన ఏకైక టీమిండియా బ్యాట్స్మన్( Team India batsman ) గా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.ఇక రాజస్థాన్ జట్టు 47 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి ఐపీఎల్ చరిత్రలోనే రెండవ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.

ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు