Yadadri Bhuvanagiri : గాంధీ విగ్రహానికి నేతన్నల వినతిపత్రం

చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేనేత కార్మికులు శనివారంయాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) చౌటుప్పల్ పట్టణం గాంధీ పార్క్ లోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

ఈసందర్భంగా తెలంగాణ ప్రాంత చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కందగట్ల భిక్షపతి( Kandagatla Bikshapathi ) మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన త్రిఫ్ట్ పథకం, చేనేత భీమా,చేనేత మిత్ర, నగదు బదిలీ పథకం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈనెల 11వ తేదీన హైదరాబాదులోని టెస్కో కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాకు చేనేత కార్మికుల పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాల్లో చేనేత కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности

Latest Video Uploads News