ఆరోగ్యానికి మేలు చేసే రొయ్యలను ఇలా తింటే చాలా డేంజర్.. తెలుసా?

సీ ఫుడ్ లో రొయ్యలు( Prawns ) ఒకటి.చేపల తర్వాత అందరూ అంతా ఇష్టంగా తినే వాటిలో రొయ్యలు ముందు ఉంటాయి.

రొయ్యలతో రకరకాల వంటలు తయారు చేస్తుంటారు.కర్రీ, ఫ్రై, బిర్యానీ, పకోడీ.

ఇలా రొయ్యలతో ఏం చేసినా కూడా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది.అలాగే రొయ్యల్లో విటమిన్స్, మినరల్స్ రిచ్ గా ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

రొయ్యల్లో సెలేనియం పుష్కలంగా ఉంటుంది.ఇది క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.

Advertisement
Worst Food Combinations With Prawns , Worst Food Combinations, Prawns,

రొయ్యల్లో ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.

Worst Food Combinations With Prawns , Worst Food Combinations, Prawns,

అలాగే రొయ్యల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి అండగా ఉంటాయి.రొయ్యలను తీసుకోవడం వల్ల మెదడు షార్ప్ గా పనిచేస్తుంది.మతిమరుపు దూరం అవుతుం.

ది రొయ్యల్లో ఉండే జింక పురుషుల్లో లైంగిక సమస్యలకు చెక్ పెడుతుంది.అందుకే వారానికి ఒక్కసారైనా రొయ్యలను తినమని నిపుణులు చెబుతున్నారు.

అయితే రొయ్యలను తీసుకునేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించాలి.ముఖ్యంగా రొయ్యలతో పాటు కొన్ని కొన్ని ఆహారాలు తీసుకుంటే చాలా డేంజర్ముఖ్యంగా మనలో చాలా మందికి నాన్ వెజ్ తినేటప్పుడు లెమన్ జ్యూస్ ( Lemon juice )ను యాడ్ చేసుకునే అలవాటు ఉంటుంది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

రొయ్యలపై కూడా కొందరు నిమ్మరసం పిండి తింటారు.కానీ ఈ పొరపాటు మీరు అస్సలు చేయకండి.

Advertisement

రొయ్యలతో( Prawns ) పాటు సిట్రస్ పండ్లను కలిపి తీసుకోకూడదు.రొయ్యల్లో ప్రోటీన్లు ఉంటాయి.

సిట్రస్ పండ్లలో ఆమ్లత్వం ఉంటుంది.ఈ రెండూ కలిసి తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

అలాగే రొయ్యలతో పాటుగా పెరుగు, పాలు( Milk curd ) వంటి డైరీ ప్రొడక్ట్స్ ను తీసుకోకూడదని చెబుతున్నారు.డైరీ ప్రొడక్ట్స్ లో క్యాల్షియం రిచ్ గా ఉంటుంది.దీనితో రొయ్యల్లో ఉండే ప్రోటీన్లు చర్య జరిపి పొట్టలో ఎసిడిటికి కారణం అవుతాయి.

రొయ్యల తో పాటు బంగాళదుంప తీసుకోకూడదు.ఎందుకంటే వీటిలో ఉండే స్టార్చ్ వేగంగా శరీరంలో చేరుతుంది.

ఫలితంగా బరువు పెరుగుతారు.బంగాళదుంపతో పాటు పిండి పదార్థాలు అధికంగా ఉండే బ్రెడ్, పాస్తా వంటివి కూడా రొయ్య‌ల‌తో తినకపోవడం చాలా ఉత్తమం.

తాజా వార్తలు