మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణత్యాగం .. భారతీయ సైనికులను స్మరించుకున్న యూకే వాసులు

భారతీయ సైనికుల ధైర్య సాహసాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వీరి పోరాట పటిమను గుర్తించిన నాటి బ్రిటీష్ ప్రభుత్వం ముఖ్యమైన యుద్ధాల్లో భారతీయ సైనికుల్నే ముందు నిలబెట్టేది.

ప్రపంచ చరిత్రలో మాయని మచ్చగా వున్న రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ నాటి బ్రిటిష్ ఇండియా సైన్యం పాల్గొంది.ఆనాటి యోధులకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ గౌరవం దక్కుతోంది.

తాజాగా దక్షిణ ఇంగ్లాండ్‌లోని( southern England ) ఒక సముద్రతీర గ్రామం మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడిన భారతీయ సైనికుల త్యాగాలను గుర్తుచేసుకుంది.ఈ వారం ప్రారంభంలో హాంప్‌షైర్‌లోని బార్టన్( Barton in Hampshire ) ఆన్ సీలో వున్న ఇండియన్ మెమోరియల్ ఒబెలిస్క్ వద్ద స్మారకోత్సవాన్ని నిర్వహించేందుకు ఇండియన్ సోల్జర్స్ మెమోరియల్ , న్యూమిల్టన్ టౌన్ కౌన్సిల్ ఫ్రెండ్స్ చేతులు కలిపాయి.

ది ఫ్రెండ్స్ ఆఫ్ ది ఇండియన్ సోల్జర్స్ మెమోరియల్‌ గతేడాది ఏర్పడిన సమూహం.ఇక్కడి స్మారక చిహ్నాన్ని శతాబ్ధం క్రితం జూలై 1917లో బార్టన్‌ భారతీయ దళాల గౌరవార్థం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా యూకేకు చెందిన రచయిత శ్రబానీ బసు( Shrabani Basu ) ‘For King and Another Country: Indian Soldiers on the Western Front, 1914-1918’ కార్యక్రమంలో పాల్గొని కీలకోపన్యాసం చేశారు.ప్రపంచ యుద్ధ సమయంలో స్థానికులు భారతీయ సైనికులకు స్వాగతం పలికారని ఆమె గుర్తుచేశారు.

Advertisement

తమ కోసం పోరాడినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారని శ్రబానీ వెల్లడించారు.దాదాపు 100 ఏళ్ల తర్వాత ఈ ప్రాంతంలో సమావేశమై స్మరించుకోవడం వల్ల ఏ లోకంలో వున్నా వారు సంతోషిస్తారని వారు అన్నారు.

బ్రిటన్‌లో( Britain ) నివసిస్తున్న సైనికుల వారసులు తమ పూర్వీకులు సాధించిన దానిపై గర్వించగలరని ఆమె పేర్కొన్నారు.

బ్రిటీష్ వలస రాజ్యాల కాలంలో 73,000 మంది భారతీయ సైనికులు విదేశాల్లో జరిగిన యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయారు.వీరిలో చాలామందికి రాజ గౌరవాలు, పతకాలు దక్కాయి.వీరిలో కొందరి జ్ఞాపకార్థం ఇండియన్ మెమోరియల్ ఒబెలిస్క్‌లో రెండు శాసనాలు వున్నాయి.

హాంప్‌షైర్‌లోని న్యూఫారెస్ట్ ప్రాంతంలో భారతీయ సైన్యం చరిత్రను యూకేలోని భారతీయ కమ్యూనిటీలు, పాఠశాలలు, ఇతర వేదికలపై ప్రచారం చేయడం ఫ్రెండ్స్ ఆఫ్ ది ఇండియన్ సోల్జర్స్ మెమోరియల్ లక్ష్యం.ఈ బృందం స్థానికంగా మరణించిన భారత సైనికుల పేర్లు, నేపథ్య కథనాలను పరిశోధిస్తుంది.

బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..
Advertisement

తాజా వార్తలు