వరల్డ్ నం. 1 క్రికెటర్స్..కానీ హత్యలు, దొంగతనాలు చేసి జైలు పాలయ్యారు

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు ఎంతో క్రేజ్ ఉంది.ఒక్కసారి జట్టుకు ఎంపిక అయితే.

డబ్బుకు డబ్బు పేరుకు పేరు వస్తుంది.అయితే కొందరు క్రికెటర్లు మాత్రం ఆటకంటే నేరాలు చేసి ఫేమస్ అయ్యారు.

అడ్డదారుల్లో డబ్బుకోసం ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు.క్రికెట్ కు మచ్చ తేవడంతో పాటు జైలు పాలయిన క్రికెటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

లెస్లీ హిల్టన్వెస్టిండీస్ తరపున లెస్లీ హిల్టన్ పలు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.ఈ ఫాస్ట్ బౌలర్ ఆ తర్వాత నేరానికి పాల్పడ్డాడు.

Advertisement
World Number 1 Cricketers And Theit Crinimal Cases. World No1 Cricketers , Crick

భార్యను హత్య చేసిన కేసులో అరెస్టు అయ్యాడు.అనంతరం ఈ కేసులో హిల్టన్‌ను ఉరి తీశారు.

హత్య కేసులో ఉరి తీయబడ్డ తొలి క్రికెటర్ గా హిల్టన్ నిలిచిపోయాడు.టెర్రీ జెన్నర్

World Number 1 Cricketers And Theit Crinimal Cases. World No1 Cricketers , Crick

ఆస్ట్రేలియన్ స్పిన్నర్ గా మంచి ప్రతిభ కనబరిచాడు టెర్రీ జెన్నర్.1988లో క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.అనంతరం ఓ సంస్థలో జాయిన్ అయ్యాడు.

జూదానికి బానిసగా మారిన జెన్నర్ తన అప్పులు తీర్చడానికి యజమాని దగ్గరే దొంగతనం చేశాడు.ఈ కేసులో అతడికి జైలు శిక్ష పడింది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

అనంతరం జెన్నర్ షేన్ వార్న్ కోచ్‌గా పనిచేశాడు.క్రికెట్ కు ఓ అద్భుత స్నిన్నర్ ను అందించాడు.

Advertisement

మోంటెగ్ డురిత్ఇంగ్లాండ్‌ ఆల్ రౌండర్ అయిన మోంటెగ్ డురిత్ ఎన్నో ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.క్రికెటర్‌గా ఉంటూనే ఎవరికీ తెలియకుండా హత్యలు చేశాడు.31 ఏళ్ల వయసులో డురిత్ చనిపోయాడు.అయితే తను హత్య చేయబడినట్లు పోలీసులు గుర్తించారు.

లండన్ సీరియల్ మర్డర్స్ నేరస్తుడు డురిత్ అని పోలీసులు తేల్చారు.క్రిస్ లూయిస్ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ లూయిస్ డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో అరెస్టు అయ్యాడు.

ఫ్రూట్స్, వెజిటెబుల్ బాక్సుల్లో డ్రగ్స్‌ ను తీసుకెళ్లినట్లు గుర్తించారు పోలీసులు.అతడి నేరాలు రుజువు కావడంతో 13 ఏండ్ల జైలు శిక్ష పడింది.

ఎడ్వర్డ్ పూలేఇంగ్లాండ్ ఆటగాడు పూలే మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. నేరం రుజువు కావడంతో జట్టు నుంచి బహిష్కరణకు గురయ్యాడు.

చివరకు కనీసం తినడానికి తిండి లేని స్థితిలో పూలే చనిపోయాడు.జాకబ్ మార్టిన్

భారత క్రికెటర్ జాకబ్ మార్టిన్ పలు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు.అనంతరం ఒక నకిలీ క్రికెట్ జట్టును తయారు చేశాడు.క్రికెట్ మ్యాచ్‌ల కోసం బ్రిటన్ వెళ్తున్నామని చెప్పి మనుషుల అక్రమ రవాణా చేశాడు.

ఈ కేసులో ఆయనకు జైలు శిక్ష పడింది.పీటర్ రోబక్ఇంగ్లాండ్‌ క్రికెటర్ పీటర్ రోబక్ గృహ హింస కేసులో అరెస్టు అయ్యాడు.

ముగ్గురు యువకులు ఇంట్లో పనికి పెట్టుకుని వారి పట్ల దాష్టీకంగా ప్రవర్తించాడు.ఈ కేసులో అతడికి జైలు శిక్ష పడింది.నవజోత్ సింగ్ సిద్దు

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్దు రోడ్డు ప్రమాదంలో ఒకరి చావుకు కారణం అయ్యాడనే కారణంతో కోర్టు అతడికి 3 ఏండ్ల పనిస్మెంట్ ఇచ్చింది.

తాజా వార్తలు