విజయ్ దేవరకొండ మీద ట్వీట్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్...

ఖుషి సినిమా( Khusi Movie ) యావరేజ్ హిట్ టాక్ తెచ్చుకొని ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమాతో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) కూడా లైగర్ లాంటి ప్లాప్ తో బయటికి వచ్చి ఒక డీసెంట్ హిట్ సాధించాడనే చెప్పాలి.

ఇలా విజయ్ దేవరకొండ కానీ సమంత ( Samantha ) కానీ, డైరెక్టర్ శివ నిర్వాణ కానీ వీళ్లు ముగ్గురు కూడా ప్లాప్ లా నుంచి తప్పించుకున్నారనే చెప్పాలి.ఇక ఇది ఇలా ఉంటె వాళ్ళు రీసెంట్ గా ఏర్పర్చిన సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తన సినిమాకి నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ

కొంత మంది ని ఉద్దేశించి కూడా మాట్లాడాడు.ఇక అలాగే ఈ సినిమా ఇచ్చిన విజయానికి ఫుల్ ఖుషి అయినా విజయ్ దేవరకొండ తన ఖుషి ని ప్రేక్షకులతో పంచుకోవడానికి ట్విట్టర్ లో ఒక లింక్ ఇచ్చి దింట్లోకి లాగిన్ అయి డీటెయిల్స్ ఫిల్ చేస్తే అందులో నుంచి 100 మంది కి ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయల చొప్పున డబ్బులు ఇస్తాను అని చెప్పాడు.ఇక దానితో చాలా మంది ఆ లింక్ లో డీటేల్స్ ని ఫిల్ చేస్తున్నారు.

ఇక ఇది తెలిసిన వరల్డ్ ఫెమస్ లవర్ మూవీ( World Famous Lover ) ప్రొడ్యూసర్ అయినా అభిషేక్ నామ( Abhishek Nama ) మా సినిమా కి 8 కోట్ల నష్టం వచ్చింది కొంచం దాని గురించి ఆలోచించవచ్చు కదా అని ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసాడు.ఆయన ఉద్దేశ్యం ఆ నష్టాన్ని పూడ్చమని కాదు కానీ ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం విజయ్ దేవరకొండ కి రెమ్యునరేషన్ ఇస్తాను కానీ నాకు ఒక సినిమా చేస్తే బాగుంటుంది ఆ నష్టం కొంతవరకు తగ్గించుకుంటా అని ఆయన అభిప్రాయాన్నిచెప్పాడు.మరి విజయ్ ఆయనకి సినిమా చేస్తాడా లేదా అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలి.

Advertisement
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 

తాజా వార్తలు