Bandi Sanjay : వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రారంభించాలి..: బండి సంజయ్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) బీజేపీ నేత బండి సంజయ్( Bandi Sanjay ) బహిరంగ లేఖ రాశారు.

సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.

అలాగే సిరిసిల్ల నేతన్నల సమ్మెను విరమింపజేయాలని సూచించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ( Sirisilla textile industry )సంక్షోభానికి ప్రభుత్వమే కారణమన్న బండి సంజయ్ ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.270 కోట్ల బకాయిలను విడుదల చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.అదేవిధంగా కొత్త ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని కోరారు.

పవర్ లూం కార్ఖానాలకు యాభై శాతం విద్యుత్ సబ్సిడీని పునరుద్ధరించాలని, ఈ క్రమంలోనే వర్కర్ టు ఓనర్ పథకాన్ని తక్షణమే ప్రారంభించాలని లేఖలో విన్నవించారు.

ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?
Advertisement

తాజా వార్తలు