వైరల్: రోడ్డు పక్కన కనిపించిన సోఫా.. అసలు ఖరీదు తెలిసి, యువతి అదిరిపోయే ప్లాన్!

అప్పుడప్పుడు మనకు రోడ్డు పక్కన కొన్ని వస్తువులు కనిపిస్తూ ఉంటాయి.కొంతమంది రకరకాల వస్తువులను విక్రయిస్తూ వుంటారు.

అవి చూడగానే చాలామంది చాలా చీప్ గా ఫీల్ అవుతూ వుంటారు.అలాంటివి కొనేవారు వేరేగా ఉంటారని అనుకుంటూ వుంటారు.

వారు అలా అనుకున్నట్టే కేవలం ప్లాట్ ఫామ్ పైన వస్తువులు కొని బతికే మంది మనచుట్టూ చాలామంది వుంటారు.నిజం చెప్పాలంటే అలాంటివారే ఇక్కడ ఎక్కువ.

ఎందుకంటే ఇక్కడ ధనవంతులు ఒక్కశాతం ఉంటే, 99 శాతం మంది బీదలే వుంటారు.

Advertisement

ఇంకా చెప్పాలంటే కొంతమంది తమకు ఇష్టంలేని కొన్ని వస్తువులను రోడ్డు పక్కన పడేస్తూ వుంటారు.ఇక ఇలాంటి వస్తువులను ఎవరు పట్టించుకుంటారు చెప్పండి.అలా రోడ్డు పక్కన కనబడే వస్తువుల రేటుని ఎవ్వరూ ఊహించరు.

ఒకవేళ వాటి ఖరీదు తెలిస్తే లటుక్కున పట్టుకుపోతారేమో.ఇక్కడ సరిగ్గా అలాంటి ఓ సంఘటనే జరిగింది.

ప్రస్తుతం ఓ యువతికి సంబంధించిన వీడియో( Viral Video ) నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.రోడ్డు పక్కన పడి ఉన్న సోఫా ఖరీదు ఇంటర్నెట్లో చెక్ చేసిన యువతి.

చివరకు అదిరిపోయే ప్లాన్ వేసింది.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
తలనొప్పి తగ్గటానికి చేసే ఈ పనులు...తలనొప్పిని పెంచుతాయా?

న్యూయార్క్‌( New York )కు చెందిన అమాండా జాయ్( Amanda Joy ) అనే యువతి ఓ రోజు వర్షంలో వీధుల్లో నడుస్తూ వెళ్తుండగా రోడ్డు పక్కన పాడుపడిన సోఫా పడి ఉండడాన్ని గమనించి కాసేపు తేరిపారా చూసి, తర్వాత దానిపై ఉన్న చెత్తాచెదారాన్ని కింద పడేసి.చివరగా ఆ సోఫా ధర( Sofa Price )కు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో చెక్ చేసింది.కాగా ఆ సోఫా ఖరీదు సుమారు $8,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.6.5 లక్షలన్నమాట.దాంతో షాక్ అయింది.

Advertisement

అంత ఖరీదు చేసే సోఫా.ఇలా వృథాగా పడి ఉండడం ఆమెకు నచ్చక దానిని శుభ్రం చేసి తన కుటుంబ సభ్యులను పిలిపించి, అనంతరం సోఫాను తన ఇంటికి తీసుకెళ్లి, అందంగా అలంకరించింది.

కాగా యువతి తెలివితేటలకు నెటిజన్లు( Netizens ) ఆశ్చర్యపోతున్నారు.