కరోనా.ఈ పేరు మన దేశంతో పాటు ఇతర దేశాల ప్రజలను ఎంతగా భయపెడుతోందో తెలిసిందే.
దగ్గినా, తుమ్మినా కరోనా వ్యాప్తి చెందటంతో ప్రజలు అలాంటి లక్షణాలు కనిపించినా భయభ్రాంతులకు గురవుతున్నారు.తాజాగా జరిగిన ఒక ఘటన కరోనా లక్షణాలు ప్రజలను ఎంతగా వణికిస్తుందో చెప్పటానికి సాక్ష్యంగా నిలిచింది.
ఒక యువతి విమానం బయలుదేరకముందు దగ్గటంతో సిబ్బంది ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించారు.షాంఘై విమానశ్రయంలోని థాయ్ ఎయిర్ లైన్స్ లో చోటు చేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పూర్తి వివరాలలోకి వెళితే కరోనాను నిరోధించటం కోసం చైనా ప్రభుత్వం భారీగా చర్యలు తీసుకుంటోంది.విమానశ్రయాల్లో, విమానాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది.
విమానంలో కూడా ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో ఒక యువతి తీవ్ర అసహనానికి గురైంది.కావాలని దగ్గు రాకపోయినా సిబ్బంది పరీక్షలు చేసే సమయంలో వారిపై దగ్గింది.
యువతి దగ్గడంతో సిబ్బంది వెంటనే ఆమె దగ్గకుండా తలను వెనక్కు పట్టుకోవడంతో పాటు వాళ్ల మీద దగ్గకుండా చేశారు.ఆ తరువాత ఆమెను డాక్టర్లకు అప్పగించి.
విమానంలోని ప్రయాణికులకు మరోసారి పరీక్షలు నిర్వహించి.విమానాన్ని పూర్తిగా శుభ్రం చేసిన తరువాత విమానం బయలుదేరింది.
సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy