వైరల్ వీడియో: పంచ్​ హోల్స్ తో బెంగాల్ టైగర్ బొమ్మను డ్రాయింగ్..!

సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎందరో అద్భుతమైన ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు.

కొందరు ప్రతిభావంతులు తమ రకరకాల టాలెంట్స్ లతో ప్రపంచవ్యాప్తంగా ఎందరో నెటిజన్లను ఫిదా చేసిన విషయం తెలిసిందే.

కొందరు తమకు ఉన్న ప్రతిభతో సోషల్ మీడియా స్టార్స్ కూడా అయ్యారు.సోషల్ మీడియా వేదికగా తమ కళలను ప్రదర్శిస్తూ డబ్బులు సంపాదించే వారు కూడా ఉన్నారు.

అయితే తాజాగా మాడలిన్ రెక్టార్ అనే ఒక యువతి కూడా ఒక సృజనాత్మకమైన ఆర్ట్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి ఆశ్చర్యపరిచారు.ఆమె హోల్ పంచెస్ తో బెంగాల్ టైగర్ పులి ని తయారుచేసి చూపించారు.

ఇందుకోసం ఆమె ఓల్డ్ మ్యాగజైన్ కవర్ పేపర్స్ సేకరించారు.బెంగాల్ టైగర్ కళ్ళు, జుట్టు, చారల రంగులు వచ్చేలాగా ఆమె ఓల్డ్ మ్యాగజైన్ కవర్ పేపర్స్ ని పంచ్ హోల్ మిషన్ తో కట్ చేశారు.

Advertisement

గుండ్రంగా ఉన్న మ్యాగజైన్ కవర్ల హోల్ పంచెస్ తో ఆమె బెంగాల్ టైగర్ ని తయారుచేసారు.

అయితే మొదట గా ఆమె ఒక చెక్క పై బెంగాల్ టైగర్ బొమ్మ గీశారు.ఎక్కడ ఏ కలరు హోల్ పంచెస్ అతికించాలో ముందే ఒక అవుట్ లైన్ తయారు చేసుకున్నారు.ఆ తర్వాతనే హోల్ పంచెస్ కట్ చేసి ముందుగా గీసుకున్న బెంగాల్ టైగర్ బొమ్మపై అతికించారు.

చాలా సమయం పాటు ఆమె కష్ట పడిన తర్వాత ఒక మంచి టైగర్ బొమ్మ తయారయింది.అయితే ఈ బొమ్మ తయారు చేయడానికి ఎటువంటి స్టెప్స్ ఫాలో అయ్యారో వీడియోలో చక్కగా రికార్డ్ చేసి ఆ వీడియోని ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.

అయితే ఆమె స్పెషల్ టాలెంట్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.మనం కూడా ప్రయత్నించవచ్చు అని.రకరకాల జంతువుల బొమ్మలను తయారు చేసి ఇంట్లో గోడలను ఆకర్షణీయంగా డెకరేట్ చేసుకోవచ్చునని అంటున్నారు.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు