నువ్వు లేకుండా నీ జ్ఞాపకాలతోనే ముందుకు వెళ్తున్నాం.. సింగర్ చిత్ర ఎమోషనల్ పోస్ట్!

తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ పాటలను ఆలపించి ఎంతోమంది ప్రేక్షక అభిమానులను ఆకట్టుకున్నటువంటి సీనియర్ సింగర్ చిత్ర ( Chitra )గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వివిధ భాషలలో ఎన్నో వందల పాటలను పాడుతూ ఎంతో మంచి గుర్తింపు పొందిన చిత్ర జీవితంలో ఓ విషాద ఘటన జరిగిన విషయం మనకు తెలిసిందే.

తన అద్భుతమైన పాటలతో అందరి మనసులో ఉన్న బాధను పోగొట్టే ఈమె తన గుండెలో మోయలేని భారాన్ని మోస్తూ పైకి చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు.పెళ్లి తర్వాత చాలా కాలానికి పుట్టిన తన కుమార్తె ఓ ప్రమాదంలో మరణించిన విషయం మనకు తెలిసిందే.

ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చిత్ర విజయశంకర్( Vijaya Shankar ) అనే ఒక ఇంజనీర్ ను పెళ్లి చేసుకున్నారు.పెళ్లయిన తర్వాత ఈ దంపతులకు చాలా సంవత్సరాలకు ఓ కుమార్తె జన్మించారు తనకు నందన( Nandana ) అనే పేరు పెట్టుకున్నారు.అయితే ఈ చిన్నారి డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతూ జన్మించారు.

ఈ వ్యాధి బాధపడే వారిలో ఎదుగుదల ఉండదు.ఇక ఈ చిన్నారికి తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న ఓ కచేరిలో పాల్గొనడానికి చిత్ర వెళ్లారు.

Advertisement

అయితే అదే సమయంలో తన కుమార్తె స్విమ్మింగ్ పూల్( Swimming pool) లో పడి మరణించిన విషయం మనకు తెలిసిందే.

ఇలా పెళ్లి తర్వాత చాలా సంవత్సరాలకు వింత వ్యాధితో బాధపడుతూ జన్మించిన కూతురిని ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్న చిత్రను తన కూతురి మరణం ఎంతగానో కృంగదీసింది.ఇక నేడు చిత్ర కుమార్తె మరణించిన దినం కావడంతో తన కుమార్తెను తలుచుకొని ఈమె సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.మా హృదయాలు నీ జ్ఞాపకాలతో నిండి ఉన్నాయి.

మేము నీ గురించి గర్వంగా మాట్లాడుకున్నాము.నువ్వు లేకుండా మా జీవితం ముందుకు సాగిపోతుంది కానీ ఎప్పటికీ ఒకేలా ఉండదు.

మా ప్రియమైన నందన మేము నిన్ను స్మరించుకుంటున్నాము అంటూ ఈ సందర్భంగా కూతురిని తలుచుకొని ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

High Roller Tipps & Casino
Advertisement

తాజా వార్తలు