రాజమౌళి కాకుండా అంటే వాళ్లు ఒప్పుకుంటారా..?

ఆర్.ఆర్.ఆర్( R.

R.R ) సినిమా వరల్డ్ వైడ్ గా సూపర్ హిట్ అవడంతో పాటుగా ఆ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ కూడా రావడం తో సినిమాపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.ఈ క్రమంలో ఆర్.ఆర్.ఆర్ సీక్వల్ మీద రాజమౌళి( Rajamouli ) అండ్ టీం ప్లానింగ్ లో ఉంది.ఆర్.ఆర్.ఆర్ తర్వాత మహేష్ తో భారీ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు రాజమౌళి.ఈ క్రమంలో మహేష్ సినిమా తర్వాత రాజమౌళి మహా భారతం చేస్తాడని అది మూడు నాలుగు భాగాలుగా ఉంటుందని అంటున్నారు.

అయితే ఈ గ్యాప్ లో ఆర్.ఆర్.ఆర్ 2 కూడా ఉంటుందని చెప్పుకుంటున్నారు.చరణ్, ఎన్.టి.ఆర్ మళ్లీ ఆర్.ఆర్.ఆర్ 2 లో కలిసి నటిస్తారట.అయితే ఆర్.

ఆర్.ఆర్ 2 రాజమౌళి డైరెక్షన్ చేసే అవకాశం లేదట.మరి రాజమౌళి కాకుంటే ఆ హీరోలు ఇద్దరు ఒప్పుకుంటారా అంటే రాజమౌళి పర్యవేక్షణలోనే సినిమా నడుస్తుంది కానీ డైరెక్టర్ గా మాత్రం వేరొకరు పనిచేస్తారట.

రాజమౌళిపై ఉన్న నమ్మకంతో చరణ్, తారక్ ( Charan, Tarak )మరోసారి ఆర్.ఆర్.ఆర్ 2 చేస్తారని చెప్పొచ్చు.ఇంతకీ ఆర్.ఆర్.ఆర్ 2 డైర్క్టర్ ఎవరు.ఆ ఛాన్స్ ఎవరికి ఉంది అని సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది.

Advertisement
జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి

తాజా వార్తలు