రేపు సాయంత్రం నుంచి తెలంగాణలో వైన్ షాపులు బంద్

తెలంగాణలో వైన్ షాపులు( Wine Shops ) బంద్ కానున్నాయి.ఈ మేరకు రేపు సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు మూత పడనున్నాయి.

పోలింగ్ కు 48 గంటల ముందు నుంచి మద్యం షాపులను మూసివేయాలని ఎన్నికల కమిషన్( Election Commission ) కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈసీ ఆదేశాల మేరకు రేపు సాయంత్రం 5 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ కానున్నాయి.

లోక్ సభ ఎన్నికల( Loksabha Elections ) నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలను నిలిపివేయాలని ఆబ్కారీ శాఖకు సర్క్యూలర్ జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు.

అదేవిధంగా జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా కూడా మద్యం షాపులు బంద్ కానున్నాయి.

Advertisement
God Of Coins Player Safety And Responsible Gambling (UK)