అన్యాయంపై మాట్లాడితే సస్పెండ్ చేస్తారా.? పయ్యావుల కామెంట్స్

రాయలసీమకు జరిగిన అన్యాయంపై మాట్లాడితే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని టీడీపీ నేత, ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.

సభ నుంచి సస్పెండ్ చేయగలరేమో కానీ ప్రశ్నించే గొంతును ఆపలేరని తెలిపారు.

గవర్నర్ చేత ప్రభుత్వం చెప్పించిన అసత్యాలను మాత్రమే ఎత్తిచూపామని పయ్యావుల పేర్కొన్నారు.ఈ క్రమంలో తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే సభ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు.

పొరుగు రాష్ట్రాలు కడుతున్న ప్రాజెక్టులతో రాయలసీమకు అన్యాయం జరిగిందని చెప్పారు.ఈ ప్రాజెక్టులపై ప్రభుత్వం నోరు మెదపడం లేదని మండిపడ్డారు.

ఆరోగ్యంగా బరువు పెరగాలనుకుంటున్నారా.. ఇలా చేయండి చాలు!
Advertisement

తాజా వార్తలు