బీజేపీని బీసీ మంత్రం.. గట్టెక్కిస్తుందా ?

తెలంగాణ విషయంలో స్లో అండ్ స్టడీగా వెలుతున్న బీజేపీ.ఇంకా గేరు మార్చేందుకు రెడీ అయిందా అంటే అవుననే చెప్పక తప్పదు.

బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్( BRS, Congress ) పార్టీలతో పోల్చితే బీజేపీ వ్యవహారం నత్తనడకన సాగుతోంది.ఎన్నికలకు పట్టుమని 25 రోజులు కూడా లేకున్నప్పటికి ఇంతవరకు ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టడంలేదు.

అభ్యర్థుల ఎంపికపైనే పూర్తి ఫోకస్ పెట్టిన కాషాయ పార్టీ ఇప్పటివరకు నాలుగు జాబితాల్లో 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.మరో 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సివుంది.

ఈ ఎంపికపై కసరత్తు జరుగుతూనే ఇకపై ప్రచారకార్యక్రమాలపై దృష్టి సారించాలని కమలనాథులు భావిస్తున్నారు.

Advertisement

అందులో భాగంగానే నేడు బీసీ బహిరంగ సభ నిర్వహించి ప్రధాని మోడి ద్వారా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చూట్టేందుకు సిద్దమయ్యారు.అయితే ప్రచారంలో భాగంగా బీసీ ఎజెండాతోనే ముందుకు సాగాలని బీజేపీ( BJP ) డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.ఎందుకంటే రాష్ట్రంలో మెజారిటీ ఓటు షేర్ ఉన్న బీసీ వర్గాన్ని ఆకర్షిస్తే తిరుగుండదనే భావనతో బీసీ నినాదాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఎప్పటికీ ఎంపిక చేసిన అభ్యర్థుల్లో మెజారిటీ సీట్లను బీసీలకే కట్టబెట్టింది కమలం పార్టీ.ఇక సి‌ఎం అభ్యర్థి విషయంలో బీసీ వర్గం నుంచే ఎన్నుకొనున్నట్లు ఇప్పటికే బీజేపీ క్లారిటీ ఇచ్చింది.

దీంతో ఎన్నికల దృష్ట్యా బీసీ మంత్రాన్ని బీజేపీ గట్టిగా జపీంచేందుకు సిద్దమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది.

అయితే ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోనూ బీజేపీ ఎంతో కొంత ప్రభావం చూపే సామర్థ్యం ఉన్నప్పటికి బీసీ వర్గంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తోంది.ఇక మైనారిటీల విషయానికొస్తే బీజేపీకి ఏకోశానా కూడా మద్దతు తెలిపే అవకాశాలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు.ఎందుకంటే బీజేపీలోని బండి సంజయ్( Bandi Sanjay ) వంటి నేతలు మైనారిటీ వర్గానికి చాలా వ్యతిరేకంగా ఉన్నారు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

గతంలో ముస్లిం వర్గాలను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏ స్థాయిలో దుమారం రేపాయో అందరికీ తెలిసిందే.అందువల్ల మైనారిటీవర్గంలో ఓట్లు వచ్చే అవకాశం లేదని భావించిన కాషాయ పార్టీ ఆ వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది.

Advertisement

దీంతో ఎటొచ్చీ కేవలం బీసీలనే నమ్ముకొని ముందుకు సాగుతున్న కాషాయ పార్టీకి.బీసీ మంత్రం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

తాజా వార్తలు