బీజేపీని పక్కన పెట్టినట్టేనా..! టీడీపీ కొత్త సర్వే ఏం చెబుతోంది..?

ఏఫీలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది.అన్ని పార్టీలు అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉన్నాయి.

ఇక పొత్తుల విషయంలో రెండేళ్లు ముందుగానే అటు టీడీపీ ఇటు జనసేనలు మేలుకున్నాయి.దాంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వ కూడదని భీష్మించుకు కూర్చున్నాయి.

ఇదే విషయాన్ని పవన్ చాలా సార్టు నొక్కి చెప్పారు.దానికోసం ఏం చేయడానికైనా సిద్దమే అన్నారు.

దాంతో పాటు.ఈ సారి పొత్తులో భాగస్వామిని గట్టి సీట్లు డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంది.

Advertisement

టీడీపీ కూడా అధికారానికి దూరం కావడానికి సిద్ధంగా లేదు.దాంతో ఈ సారి పవన్ ను ఎలాగైనా ఒప్పించి అధికారంలోకి రావాలని చూస్తున్నారు.

ఇప్పటికే పవన్ బీజేపీతో ములాఖత్ లో ఉన్నారు.బీజేపీ మాత్రం టీడీపీ పేరు వింటేనే ఆమడదూరం వెళుతోంది.

దాంతో వాళ్లు.టీడీపీ పొత్తు విషయంలో ససేమీరా అంటున్నారు.

అయితే ఇదే టైం లో బీజేపీ టీడీపీ సర్వేలు. బయటకు వచ్చాయని వార్తలు వస్తున్నాయి.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

ఈ సర్వేల్లో.బీజేపీ కూరలో కరివేపాకు మాదిరిగా మారిందని సైతం వదంతులు వస్తున్నాయి.

Advertisement

అంటే ఏపీలో బీజేపీతో కాకుండా.టీడీపీ జనసేనలు మాత్రమే పొత్తు పెట్టుకుంటే భారీ లాభం చేకూరుతుందని.

బీజేపీని కలుపుకున్నా.వదిలేసి వెళ్లినా.

ఫలితం మాత్రం అలాగే ఉంటోందని తెలుస్తోంది.

దానికి తోడు టీడీపీ నేతలు కూడా.బీజేపీని ఎక్స్రా లగేజీగానే భావిస్తూ ఉన్నారు.ఆ పార్టీని కలుపుకుంటే.

జగన్ ఒంటరి అయిపోయాడనే సింపతీ మీద మరో సారి గెలిచే అవకాశం ఉందని బాబు అంచనా వేస్తున్నారు.దాంతో బీజేపీని పక్కన పెట్టేందుకే బాబు పవన్ లు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

ఇక సర్వేలు కూడా దాదాపు వంద సీట్లను ఈ కూటమికి ఖరారు చేయడంతో.మాంచి జోష్ లో కనిపిస్తూ ఉన్నారు.

బీజేపీ మాత్రం ఇంకా బీరాలకు పోతూనే ఉంది.దానికి తోడు గట్టి సీట్లను డిమాండ్ చేస్తోంది.దాంతో ఆ బీజేపీకి ఇచ్చే సీట్లు ఏదో జనసేనకు ఇస్తే.

కొంత మేరకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.ఇక టీడీపీ కేడర్ సైతం బీజేపీని పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఎప్పుడూ ఏదో మత గొడవను మీదేసుకుని బయలుదేరుతుంది.దాంతో అది జనసేన, టీడీపీల్లోని మైనారిటీలకు నచ్చడం లేదు.

బీజేపీని కలుపుకుంటే.ఆమేరకు నష్టం వస్తుందని.

బీజేపీకి కటీఫ్ చెప్పాలని రెండు పార్టీలు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.