మీర్జాపూర్ సీజన్ 3 హిట్ అవుతుందా..?

బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న సిరీస్ ఏదైనా ఉంది అంటే అది మీర్జాపూర్ ( Mirzapur )అనే చెప్పాలి.

అయితే ఇప్పటికే ఈ సిరీస్ కి సంబంధించిన రెండు సీజన్లు సూపర్ సక్సెస్ సాధించాయి.

ఇక ఇప్పుడు దాంతో సీజన్ 3 కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు.నిజానికి ఈ సీజన్ 3 ఈరోజు రాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ ( Streaming on Amazon Prime )అవ్వబోతుంది.

మరి ఈ సీజన్ 3 ని చూడడానికి ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఒక పెద్ద సినిమాకి ఉన్నంత క్రేజ్ అయితే ఈ సీరీస్ ఉండటం నిజంగా దానికి చాలా వరకు ప్లస్ అయ్యే అవకాశలైతే ఉన్నాయి.ఇక స్ట్రీమింగ్ అయిన వెంటనే సీరీస్ ను చూడ్డానికి చాలామందికి కాచుకు కూర్చున్నారు.మరి మొదటి సీజన్ మాదిరిగానే ఈ సీజన్ కూడా సూపర్ సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

Advertisement

ఇక ఈ సీజన్ ను రక్తంతో రాసిన కథగా ప్రచారం చేస్తున్నారు.మరి దానికి అనుగుణంగానే సిరీస్ ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.మొదటి రెండు పార్టుల్లో కీలక పాత్ర వహించిన మున్నా( Munna ) ఈ సీజన్ లో ఉండకపోవడం ఈ సీజన్ కి మైనస్ గా మరే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది.

మరి మొత్తానికైతే ఈ సీజన్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.ఈ సీజన్ కూడా హిట్ అయితే ఇక దీనికి సంబంధించిన మరొక సీజన్ ను కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి మొత్తానికైతే ఈ సిరీస్ తో మీర్జాపూర్ సీజన్ 4 ఉండబోతుందా లేదా అనే విషయం లో కూడా క్లారిటీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు