ఉప్పెన హీరోను మెగా కాంపౌండ్ పట్టించుకోవడం లేదా?

మెగా హీరోల్లో వైష్ణవ్ తేజ్ ఒకరు.ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకుల చేత శబాష్ అనిపించు కున్నాడు.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా ద్వారా వైష్ణవ్ తేజ్ తెలుగు సినిమా తెరకు పరిచయం అయ్యాడు.ఈ సినిమా దాదాపు 100 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించడంతో ఈయన క్రేజీ హీరోగా మారిపోయాడు.

ఫస్ట్ సినిమా హిట్ తోనే సూపర్ హిట్ అందుకోవడంతో ఈయనకు పెద్ద పెద్ద బ్యానర్ల నుండి వరుస అవకాశాలు వరించాయి.ఇక ఉప్పెన సినిమా తర్వాత కొండపొలం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.

ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్న కూడా ఈయన అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టు కున్నాడు.ఇక ఇప్పుడు వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Advertisement

అయితే ఈ సినిమా కూడా నిరాశ పరిచింది.దీంతో ఈ మెగా హీరో కెరీర్ డైలమాలో పడింది.

వరుస ప్లాపులతో ఈయన మార్కెట్ భారీగా డౌన్ అయ్యింది.మరి మేకర్స్ ఈ మెగా హీరోతో సినిమాలు చేసేందుకు ఇప్పుడు ఆసక్తి చూపిస్తారో లేదో అనుమానంగా మారింది.

ఈ ప్లాపులు వస్తున్న నేపథ్యంలోనే వైష్ణవ్ తేజ్ గురించి మెగా కాంపౌండ్ పట్టించు కోవడం లేదా.వారు కథల విషయంలో ఈ యంగ్ హీరోకు ఎలాంటి సలహా సహకారాలు అందివ్వడం లేదా అనే చర్చ మొదలయ్యింది.వైష్ణవ్ కకూడా చిరు లాంటి వారి సలహాలు తీసుకోవడం లేదా.

తీసుకుంటే మంచిది కదా అని విశ్లేషకులు కూడా అంటున్నారు.మరి నెక్స్ట్ సినిమాతో అయినా హిట్ పడుతుందో లేదో చూడాలి.

నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
Advertisement

తాజా వార్తలు