ఒకవైపు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని విస్తరించే పనుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ నిమగ్నం కాగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ కు పొత్తు కుదిరే అవకాశం ఉన్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
దేశవ్యాప్తంగా బిజెపిని అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ విడివిడిగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
బిజెపి వ్యతిరేక పార్టీలన్నిటిని కలుపుకుని బలమైన శక్తిగా ఎదగాలని చూస్తున్న కేసీఆర్ కు పరిస్థితులు అంత సానుకూలంగా లేకపోవడంతో, ఏం చేయాలో పాల్గొని పరిస్థితి నెలకొందని, ఈ క్రమంలోనే కాంగ్రెస్ కీలక నేతగా గుర్తింపు పొంది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోనూ వేలుపెట్టిన ఏపీకి చెందిన కెవిపి రామచంద్రరావు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తు వ్యవహారాలను చక్కబెట్టే పనుల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం కావడానికి కేసీఆర్ ప్రధాన కారణమని కాంగ్రెస్ అధిష్టానం లో తీవ్ర ఆగ్రహం ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపిని అధికారంలోకి రాకుండా చేయాలంటే కెసిఆర్ సహకారం తీసుకోవాలనే ఆలోచనతో ఉందట.ఈ మేరకు కెవిపి కెసిఆర్ తో సన్నిహితంగా మెలిగే వ్యక్తి కావడంతో , ఆయన ఇప్పుడు చక్రం తిప్పుతున్నారట.గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానంటూ కేసిఆర్ బహిరంగంగా ప్రకటించారు.
అయితే దానిని నిలబెట్టుకోకపోవడం , రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనం అవ్వడానికి పరోక్షంగా కారణం కావడంతో కెసిఆర్ పై కాంగ్రెస్ అధిష్టానానికి తీవ్ర ఆగ్రహం ఉన్నా.ప్రస్తుత పరిస్థితుల్లో కెసిఆర్ తో చేయి కలిపేందుకు సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం.
దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కీలక నేతలే టార్గెట్ గా ఈడీ, సీబీఐ వంటి సంస్థలు రంగంలోకి దిగాయి.ఢిల్లీ లిక్కర్ స్కాం లో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితకు ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి.
ఆమె అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ఈ క్రమంలోని బీఆర్ఎస్ కూడా తమతో కలిసివచ్చే వారిని వదులుకోకూడదు అనే అభిప్రాయంతో ఉంది.
ఈ క్రమంలోనే కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్న బిజెపి వ్యతిరేక కూటమి లో కాంగ్రెస్ కూడా చేరే అవకాశం కనిపిస్తోంది. .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy