మృత్యుంజయ హోమం జరిపిస్తే మృత్యువు ఆగిపోతుందా..?

చాలా మంది మన ప్రాణాలకు ఏదైనా అపాయం ఉందని తెలిసినా లేదా ఏదైనా ప్రాణ గండం ఉందని తెలిసినా మృత్యుంజయ హోమం జరిపిస్తుంటారు.

అలా చేయడం వల్ల మృత్యువు ఆగిపోతుందని బావిస్తుంటారు.

అయితే అందులో నిజమెంత ఉందో చాలా మందికి తెలియదు.అయితే నిజంగానే మహా మృత్యుంజయ హోమం జరిపిస్తే.

WILL DETH STOP IF MRUTHYUNJAYA HOMA IS PERFORMED, Mruthunjaya Homam, Death , Poo

మృత్యువు ఆగిపోతుందా లేదా అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసు కుందాం.మృత్యుంజయుడు అనగా మృత్యువుని జయించిన వాడు అని అర్థం.

అయితే మనం ఎప్పుడు, ఎలా, ఎక్కడ పుడతామో కూడా మనకు తెలియదు.అలాగే ఎప్పుడు, ఎక్కుడ, ఎలా మరణిస్తామో కూడా మనం తెలుసుకోలేం.

Advertisement

ఈ రెండు విషయాలను తన వద్ద రహస్యంగా ఉంచుకునే వాడు భగవంతుడు అలాంటి రెండింటిలో మృత్యువని జయించాలంటే ఈయన్ని ఆశ్రయించాలని ఈ మృత్యుంజయ అనే పదం మనకి చెప్తోంది.అలా మృత్యువుకి పోవలసిన వాళ్లంతా ఈయన్ని ఆశ్రయిస్తే ఇక ఎవరికీ చావే రాక ఉండక అసలు ప్రపంచంలో లయమనే కార్యక్రమమే ఆగిపోతుంది.

కాబట్టి మృత్యువుని జయించిన వాడనే మాటకి అర్థం ఇది కాదు.తాత్కాలికంగా మనకి చావుతో సరే  అమానంగా వచ్చి పడే ఆపదని అప మృత్యువు అంటారు.

ఇలా కాకుండా మరణించే కాలంలో వచ్చిన ఆపదని మృత్యువు అంటారు.ఈ రెండింటిలోనూ మనకి తెలియ కుండా వచ్చిన చావుతో సమానమైన పరిస్థితినిఎదిరించ గల  శక్తిని మనకిచ్చే వాడే మృత్యుంజయుడు అని అర్థం.

అందుకే చావు సమీపిస్తున్నది అని అనిపించినపుడు మహా మృత్యుంజయ జపం, హోమం వంటివి చేయుంచు కుంటారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025
Advertisement

తాజా వార్తలు