ఇంద్ర రీ రిలీజ్ తో చిరంజీవి మహేష్ బాబు రికార్డ్ ను బ్రేక్ చేస్తాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న చాలామంది నటులు వాళ్ల సినిమాలతో ఇండస్ట్రిలో సూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీని ఉన్నత స్థానంలో నిలపడానికి చాలా వరకు ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) తెలుగు సినిమా ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కించారనే చెప్పాలి.

ఈయన రాకతో సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్లింది.ఇక ఈయన ఎంట్రీ ఇచ్చాక సినిమాలను తీసే విధానం గాని ప్రేక్షకులు చూసే విధానం గాని మారిపోయిందనే చెప్పాలి.

ఇక ఇలాంటి చిరంజీవి హీరోగా వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకున్నాయి.మరి ఆయన చేసిన సినిమాలన్నింటిలో కమర్షియల్ సినిమాగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఇంద్ర సినిమా( Indra Movie ) సూపర్ హిట్టుగా నిలిచింది.ఇక ఈ సినిమాని ఆగస్టు 22వ తేదీన రీరిలీజ్ చేస్తున్న సందర్భంగా ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

మరి రీ రిలీజ్ లో కూడా ఈ సినిమా భారీ రికార్డులను బ్రేక్ చేయడం పక్క అంటూ చిరంజీవి అభిమానులు తెలియజేస్తున్నారు.

Advertisement

మరి మొత్తానికైతే ఈ సినిమాతో చిరంజీవి మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమాతో చిరంజీవి మురారి సినిమా( Murari Movie ) రికార్డును బ్రేక్ చేస్తాడా లేదా అనేది.ఇక రీసెంట్ గా రీ రిలీజ్ అయినా మురారి సినిమా భారీ సక్సెస్ ని అందుకుంది.

మరి ఆ సినిమా రికార్డు బ్రేక్ చేసి చిరంజీవి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తాడా లేదా అనేది తెలియాలంటే ఈనెల 22వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.ఇక ఆ రోజు చిరంజీవి బర్త్ డే వల్ల సినిమా భారీ సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు