భూమా అఖిలప్రియ కు బెయిల్ వచ్చేనా?..!!

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మాజీమంత్రి టీడీపీ నాయకురాలు భూమా అఖిల ప్రియా బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగనుంది.

అనారోగ్య కారణాల వల్ల అఖిల ప్రియ కు బెయిల్ ఇవ్వాలని పిటిషనర్లు కోరుతున్నారు.

మరోపక్క అఖిలప్రియ ను కస్టడీకి అప్పగించాలని పోలీసులు వేసిన పిటిషన్ ఫై కూడా ఇవాళ విచారణ జరగనుంది.ప్రస్తుతం రిమాండ్లో ఉంది .ఇటువంటి నేపథ్యంలో కోర్టు అఖిలప్రియ కి కస్టడీ విధిస్తూ ఉందా లేకపోతే బెయిల్ ఇస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది.

కేసు తీవ్రత బట్టి చూస్తే సీసీ ఫుటేజ్ వీడియో ఉండటంతో అఖిలప్రియ కు బెయిల్ రావడం కష్టమే అన్న టాక్ ప్రస్తుతం వినబడుతోంది.ఒకవేళ అనారోగ్యం అని న్యాయస్థానం భావిస్తే హాస్పిటల్ లోనే పోలీసుల చేత విచారణ చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.ఇదిలాఉంటే భూమా అఖిలప్రియ అరెస్టు వెనకాల వైసీపీ హస్తం ఉందని టిడిపి పార్టీ యువ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి ఆరోపణలు చేస్తూ ఉన్నారు.

ఏది ఏమైనా భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ విషయంలో కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠత రెండు తెలుగు రాష్ట్రాలలో నెలకొంది. .

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??
Advertisement

తాజా వార్తలు