రైల్వే స్టేషన్‌లో పసుపు రంగు టైల్స్ ఎందుకు అమరుస్తారో తెలిస్తే..

మీరు ఎప్పుడో ఒకప్పుడు రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌ను చూసేవుంటారు.అక్కడ పసుపు రంగు రఫ్ టైల్స్ ఉండటాన్ని మీరు గమనించేవుంటారు.

వీటిలోని కొన్ని కొన్ని టైల్స్ గుండ్రంగానూ ఉంటాయి.ఈ రఫ్‌టైల్స్ వలన కాలికి పట్టుదొరుకుతుందని చాలామంది అనుకుంటారు.

వీటివలన జారి పడకుండా ఉంటామని భావిస్తారు.అయితే ఇలా అనుకోవడంలో వాస్తవం లేదు.

ఈ పలకలను ప్లాట్‌ఫారమ్‌పై ఇతర ప్రయోజనాల కోసం అమరుస్తారు.రైల్వే మరియు మెట్రో స్టేషన్లలో ఈ పసుపు రంగు టైల్స్ కనిపిస్తాయి.

Advertisement
Why Yellow Tiles Are Installed In Railway Stations Details, Passengers Track Pl

ఇవి దృష్టి లోపం ఉన్నవారి కోసం అమరుస్తారు.స్టేషన్‌లో పసుపురంగు గుండ్రని టైల్స్ ఉంటే, ప్రయాణీకులు అక్కడే ఆగిపోవాలని అది సూచన.

అయితే పసుపు రంగు స్ట్రెయిట్ టైల్స్ ఉంటే ప్రయాణీకులు ముందుకు కదలవచ్చని సూచన.ఈ టైల్స్.

దృష్టి లోపం ఉన్నవారు నడిచేందుకు ఉపకరిస్తాయి.వీటిని అంధుల స్పర్శ మార్గాలు అంటారు.

రైల్వే స్టేషన్‌లో ఉండే ఈ టైల్స్‌ వలన మరో ప్రయోజనం కూడా ఉంది.రైల్వే స్టేషన్‌లో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కనెక్ట్ చేయడానికి అనేక రకాల కేబుల్స్, పైపులు, వైర్లు అమర్చబడి ఉంటాయి.

Why Yellow Tiles Are Installed In Railway Stations Details, Passengers Track Pl
ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
జర్మనీ బీచ్‌ల‌లో షాకింగ్ రూల్స్.. బట్టలు వేసుకుంటే ఇక గెంటేస్తారట..?

పైపులు, కేబుల్స్, వైర్లు ఈ పసుపు రంగు టైల్స్ కింద నుండి అమరుస్తారు.కనెక్షన్‌లో ఎప్పుడైనా సమస్య తలెత్తితే ఈ టైల్స్‌ను సులభంగా తొలగించడం ద్వారా సమస్య పరిష్కరిస్తారు.ప్లాట్‌ఫారమ్‌లో ఈ టైల్స్‌తో పాటు, రైల్వే సైన్ బోర్డులన్నీ కూడా పసుపు రంగుతో‌నే ఉంటాయి.

Advertisement

దీని వెనుక ఒక కారణం ఉంది.వాస్తవానికి పసుపు రంగు సూర్యకాంతితో ముడిపడి ఉంటుంది.

ఇది చాలా దూరం నుండి కూడా కనిపిస్తుంది.అందువల్ల, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పసుపు రంగు మెరుగైనదిగా పరిగణిస్తారు.

" autoplay>

తాజా వార్తలు