మాంసాహారం తిన్న తర్వాత దేవాలయానికి ఎందుకు వెళ్లకూడదో తెలుసా..?

సాధారణంగా చెప్పాలంటే ప్రతి రోజు చాలా మంది ప్రజలు దేవాలయాలకు( Temple ) వెళ్లి భగవంతునికి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.

మరి కొంతమంది భక్తులు దేవాలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.

దాదాపు దేవాలయాలకు వెళ్లే ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా స్నానం చేసి భగవంతుని దర్శనానికి వెళ్తూ ఉంటారు.దేవాలయాలకు వెళ్లి భగవంతుని( God ) దర్శించుకోవడానికి కొన్ని నియమ నిబంధనలు కచ్చితంగా ఉంటాయి.

ప్రజలు కచ్చితంగా వాటిని అనుసరించి మాత్రమే దేవాలయాలకు వెళ్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే దేవాలయాలకు వెళ్లడం చాలామందికి అలవాటు గా ఉంటుంది.

అందుకే మనసుకు ఏదైనా బాధగా అనిపించినా లేదా సంతోషం సమయంలో కూడా కొందరు దేవాలయానికి వెళుతూ ఉంటారు.అయితే మన పెద్దవాళ్లు చెప్పేదాన్ని ప్రకారం మాంసం తిన్నాక( Non-Veg ) గుడికి వెళ్లకూడదని చెబుతూ ఉంటారు.అయితే దీని వెనుక ఉన్న రీజన్ మాత్రం చాలా మందికి తెలియదు అని కచ్చితంగా చెప్పవచ్చు.

Advertisement

కానీ అసలు మాంసం తిన్న తర్వాత గుడికి ఎందుకు వెళ్ళకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.ఎవరైనా సరే మానసిక ప్రశాంతత, అలసటను మరిచి కొద్దిసేపు సంతోషంగా గడపడానికి దేవాలయానికి వెళ్తారు.

అయితే మాంసాహారం తిన్నప్పుడు మీ శరీరం, మనసు కొద్దిగా అలసిపోయినట్లుగా, మందగించినట్లుగా అనిపిస్తుంది.అలాంటప్పుడు మీరు దేవాలయానికి వెళితే అక్కడి సానుకూల ప్రకంపనలను అనుభవించడానికి మీ మనస్సు శరీరం అంగీకరించవు.మాంసాహారంలో తామసిక గుణాలు ఎక్కువగా ఉన్నందువల్ల మీ మనసు మంచి ఆలోచనలు, ప్రకంపనలను అనుభవించడానికి అనుమతించదు.

ఇది మీ అంతర్గత ప్రశాంతతకు భంగం కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు.అందువల్ల మాంసాహారం తిన్న తర్వాత ఆ దేవాలయానికి వెళ్ళకూడదని పండితులు చెబుతూ ఉంటారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
Advertisement

తాజా వార్తలు