కాశీ పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మొదటగా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాల్సిందే..!

కాశీ పుణ్యక్షేత్రానికి వెళ్లడం కంటే ముందు దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం ఒకటి ఉందని దాదాపు చాలా మందికి తెలియదు.

కాశీ( Kashi ) పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే ఎంతటి పుణ్య ఫలితం లభిస్తుందో కుండలేశ్వరాన్ని( Kundaleswaram ) దర్శించుకుంటే కూడా అంతే పుణ్య పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే తూర్పు గోదావరి జిల్లాలోని నది తీర ప్రాంతంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది.ఇక్కడ గోదావరి నదిని వృద్ధ గౌతమి అని పిలుస్తారు.

ఈ పుణ్య నదిలో స్నానం చేసి కుండలేశ్వర స్వామికి అభిషేకం చేయించుకుని ఆ తర్వాత కాశీ పుణ్యక్షేత్రానికి వెళ్లాలని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే కాశీ పుణ్యక్షేత్రానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ గంగా నది ( Ganga River ) స్నానం చేస్తారు.

ఆ సమయంలో గంగానది తమ పాపాలను దూరం చేస్తుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.అలాగే ఏ పాపాలు చేయని వారు గంగా నదిలో స్నానం చేస్తే గంగాదేవి ఎంతో సంతోషంగా భక్తుల ను ఆశీర్వదిస్తుందని పండితులు చెబుతున్నారు.

Advertisement

కాశీ పుణ్యక్షేత్రమైన, హరిద్వారైన ఎక్కడికి వెళ్లాలనుకున్న కచ్చితంగా కుండలేశ్వర స్వామిని( Kundaleswara Swamy ) దర్శించుకుని, స్వామికి అభిషేకం చేయించుకున్న తర్వాతే వెళ్లాలని పండితులు చెబుతున్నారు.

కుండలేశ్వరం ఎలా వెళ్లాలో ఇప్పుడు తెలుసుకుందాం.కాశి హరిద్వార్ వంటి గంగా తీరంలో ఉన్న క్షేత్రాలు దర్శించుకుంటే గంగా నది యొక్క అనుగ్రహం వల్ల కోరుకునే కోరికలు గంగానది తీరుస్తుందని పురాణాలలో ఉంది.ఈ కుండలేశ్వర స్వామి దేవాలయం మురమళ్ళకు దగ్గరలో కాట్రేనికోన మండలంలో ఉంటుంది.

కాకినాడ నుంచి యానం మీదుగా టాక్సీలో ఈ పుణ్యక్షేత్రానికి వెళ్లవచ్చు.అలాగే బస్సులో కానీ, రైలులో కానీ, విమానంలో కానీ రాజమండ్రి చేరుకున్న తర్వాత టాక్సీ లో ఈ కుండలేశ్వరం చేరుకోవచ్చు.

అలాగే రాజమండ్రి నుంచి బస్సులో అమలాపురం వెళ్లి అక్కడి నుంచి ఆటోలో ఈ కుండలేశ్వరం వెళ్ళవచ్చు.అమలాపురం నుంచి కుండలేశ్వరనికి బస్సు కూడా ఉంటుంది.కుండలేశ్వరనికి చేరుకుని గోదావరి స్నానం చేసి కుండలం ఆకారంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకుని పూజలు చేసుకోవచ్చు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి27, సోమవారం 2025

ఈ పుణ్యక్షేత్రంలో రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం కూడా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు