బోరున విలపించిన వాణీ విశ్వనాథ్.. షూటింగ్ వదిలేసి వెళ్లిన ఎన్టీఆర్.. అసలేం జరిగింది.?  

ఎన్టీఆర్, వాణీ విశ్వనాథ్ జంటగా నటించిన సినిమా సామ్రాట్ అశోక‌.చక్రవర్తి అశోకుడి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరెక్కించారు.

ఎన్టీఆర్ ఈ సినిమాకు నిర్మాతగా, దర్శకుడిగా కూడా వ్యవహరించాడు.ఈసినిమాకు సంబంధించిన చాలా వరకు షూటింగ్ హైదరాబాద్ లోని రామ‌కృష్ణా స్టూడియోస్‌లోనే చేశారు.

ఈ సినిమాలో హీరోగా ఆయనే చేయగా.హీరోయిన్ గా అప్పుడప్పుడే ఎదుగుతున్న వాణీ విశ్వనాథ్ చేసింది.

బాపు సూచనతో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నాడు ఎన్టీఆర్.సినిమా సగం వరకు షూటింగ్ అయిపోయింది.

Advertisement
Why Vani Vishwanath Cried In Shooting, Vani Vishwanath,,Senior NTR, Director Bap

కీలకమైన సన్నివేశాలతో పాటు పాటను షూట్ చేస్తున్నారు.వాస్తవానికి పాటలను సినిమా చివర్లో గానీ, ముందుగానీ చిత్రీకరించేవాడు ఎన్టీఆర్.

సినిమా మొత్తం చేసిన తర్వాత పాటలు చేయాలంటే చాలా మందికి ఓపిక ఉండదు.అయినా ఎందుకో గానీ ఆయన చివరలో పాటలు షూట్ చేస్తున్నాడు.

ఒకరోజు అనుకోకుండా హీరోయిన్ వాణీ విశ్వనాథ్ షూటింగ్ ఎగొట్టింది ఎంత సేపు వెయిట్ చేసినా.తను రాలేదు.

దీంతో తన ల్యాండ్ లైన్ కు ఫోన్ చేశారు.మేడం హైదరాబాద్ కే వచ్చింది అని సమాధానం అందింది.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal

కానీ తను షూటింగ్ దగ్గరికి మాత్రం రాలేదు.

Why Vani Vishwanath Cried In Shooting, Vani Vishwanath,,senior Ntr, Director Bap
Advertisement

కొంత సమయం తర్వాత బాపు అసిస్టెంట్ రామ‌కృష్ణా స్టూడియోస్ కు వచ్చాడు.ఎన్టీఆర్ ను కలిశాడు.ఓక విషయంలో హీరోయిన్ చాలా బాధ పడుతుంది.

అందుకే సినిమా షూటింగ్ కు రాలేదు.ప్రస్తుతం బాపు ఇంట్లోనే ఉంది అని చెప్పాడు.

ఎన్టీఆర్ షాక్ అయ్యాడు.వెంటనే షూటింగ్ ఆపి తను ఫామ్ హౌస్ కు వెళ్లిపోయాడు.

మూడు రోజుల తర్వాత బాపు.వాణీని తీసుకుని ఎన్టీఆర్ ను కలిసేందుకు వచ్చాడు.

అప్పుడు వాణీ ఒక్కసారిగా ఏడ్చిందట.ఆమె భుజం తట్టి.

అదంతా పుకారే.నీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని సర్ది చెప్పాడట ఎన్టీఆర్.

దీంతో తను కూల్ అయ్యింది.మిగతా షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొంది.

వాస్తవానికి ఆమె మీద వచ్చిన పుకారు ఏంటంటే. ఎన్టీఆర్ వాణీ విశ్వ‌నాథ్‌ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారట.

అందుకే తనను సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడు.సినిమా అయిపోగానే పెళ్లి అవుతుందని అని ఇండస్ట్రీలో పుకారు లేచిందట.

దీంతో హీరోయిన్ బాగా ఇబ్బంది పడి బాపుకు చెప్పిందట.ఆ తర్వాత బాపు ఈ విషయాన్ని సర్దుబాటు చేశాడట.

" autoplay>

తాజా వార్తలు