గాడి తప్పుతున్న టాలీవుడ్ .. వెక్కిరిస్తున్న వరస ఫ్లాపులు

ఆర్ ఆర్ ఆర్, పుష్ప సినిమా విజయాలతో పాన్ ఇండియా స్థాయిలో కాలర్ ఎగరేస్తున్న టాలీవుడ్ ప్రస్త్తుతం డీలా పడింది.

ఒక నెల విజయాలు ఉంటె మరో నెల పరాజయాలు వెక్కిరిస్తున్నాయి.

జూన్, జులై మాసంలో వరస పరాజయాలు చవి చూసి బిక్కుమన్న టాలీవుడ్ ను ఆగష్టు మాసం ఆడుకుంది.బింబి సారా, సీత రామం చిత్రాలు ఉరటనివ్వడమే కాదు.

ఒకే రోజు విడుదల అయ్యి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి.ఇక ఆగష్టు మధ్యలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం కార్తికేయ అన్ని భాషల్లో మంచి వసూళ్లను సాధిస్తుంది.

మూడు బ్యాక్ తో బ్యాక్ హిట్స్ పడ్డ జోష్ లో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ ఆ తర్వాత వచ్చిన సెప్టెంబర్ గండం దాటడానికి తెలుగు సినిమా పరిశ్రమకు దిన దిన గండం గా ఉంది.మొదటగా, అమల, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఒకే ఒక్క జీవితం సినిమా పర్వాలేదు అనిపించినా, సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ప్రేక్షకుల అంచనాలను తారు మారు చేస్తూ ఘోరమైన ఫ్లాప్ టాక్ ని టాలీవుడ్ కి ఇచ్చింది.

Advertisement
Why Tollywood Facing Hard Time , Tollywood, Regina, Nivedha, Naga Shaurya, RRR,

ఇక ఆ తర్వాత వచ్చిన కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా పరిస్థితి సరేసరి.

Why Tollywood Facing Hard Time , Tollywood, Regina, Nivedha, Naga Shaurya, Rrr,

ఇక రెజీనా, నివేద ప్రధాన పాత్రలో నటించిన శాకినీ డాకిని అనే కొరియన్ బేస్డ్ సినిమా సైతం అస్సలు జనాలు పట్టించుకునే పరిస్థితి లేదు.ఇలా ఫ్లాప్ సినిమాలతో మల్లి టాలీవుడ్ కుదేలవుతుంటే నెలాఖరున వస్తున్న నాగ శౌర్య సినిమా కృష్ణ వ్రింద విహారి పైనే అందరు ఆశలు పెట్టుకున్నారు.ఈ సినిమా విజయవంతం అవ్వడం నాగ శౌర్య కు కూడా ఖచ్చితంగా అవసరం.

ఇక మరో వైపు నాగార్జున ద ఘోస్ట్ మరియు చిరంజీవి గాడ్ ఫాదర్ వస్తే తప్ప ఇండస్ట్రీ విజయాలను చుడదా అనే పరిణామం నెలకొని ఉంది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు