లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌లో నటించిన యంగ్ సెలబ్రిటీలందరూ సక్సెస్.. ఆ ఒక్కరు తప్ప..?? 

2012లో విడుదలైన "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" సినిమా ఓ మోస్తారు హిట్ సాధించిన సంగతి తెలిసిందే.

శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అభిజిత్ హీరో.

ఇందులో రాకేష్‌గా నవీన్ పొలిశెట్టి, అజయ్‌గా విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) నటించారు.ఈ సినిమాలో వీరి పాత్రలు చాలా చిన్నవి.

అవి కూడా నెగిటివ్ రోల్స్.బాగా కాన్సెంట్రేట్ చేసి సినిమా చూస్తే తప్ప ఇందులో వీళ్లు నటించారనే సంగతి తెలియదు.

ఇక ఉండి లేనట్టు ఈ సినిమాలో నటించాడు శ్రీ విష్ణు.వీళ్లు ఈ మూవీలో చిన్న పాత్రలో వేసినా సరే ఆ తర్వాత మంచి మంచి సినిమాలతో స్టార్ హీరోలుగా మారిపోయారు.

Why This Hero Is Not Able To Succeed , Tollywood , Hero Abhijith, Life Is Beauti
Advertisement
Why This Hero Is Not Able To Succeed , Tollywood , Hero Abhijith, Life Is Beauti

నవీన్ పొలిశెట్టి "జాతి రత్నాలు" సినిమా తర్వాత స్టార్ హీరో అయిపోయాడు.మిస్ షెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మరో హిట్ కొట్టి సక్సెస్‌ఫుల్ హీరోగా అవతరించాడు.ఇక విజయ్ దేవరకొండ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో విజయ్ స్టార్ హీరో అయిపోయాడు.మరోవైపు శ్రీ విష్ణు మెంటల్ మధిలో, బ్రోచేవారెవరురా, రాజ రాజ చోరా, ఓం భీమ్ బుష్ వంటి హిట్ సినిమాల్లో హీరోగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇప్పుడు మూడు సినిమాలకు సైన్ చేసి చాలా బిజీగా గడుపుతున్నాడు.

Why This Hero Is Not Able To Succeed , Tollywood , Hero Abhijith, Life Is Beauti

ఇందులో ఒక చిన్న వేషం వేసిన శ్రీముఖి( Sreemukhi ) కూడా మంచిగా సెటిల్ అయ్యింది.ఈ సినిమాలోని ఒక చిన్న రిసెప్షన్‌లో కనిపించిన అందాల తార ఈషా రెబ్బా కూడా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో నాగ్ అశ్విన్ కూడా కనిపించాడు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

రీసెంట్ గా కల్కి సినిమాని తీసి మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.ఇందులో నాగ్ అశ్విన్ రాకేష్ సూచన మేరకు మాయపై డ్రోన్‌ను ఉపయోగించే గోల్డ్ ఫేజ్ పర్సన్ గా యాక్ట్ చేశాడు.

Advertisement

మొత్తం మీద ఇందులో నటించిన యంగ్ సెలబ్రిటీస్ అందరూ కూడా తర్వాత కాలంలో సక్సెస్ సాధించారు కానీ ఇందులో హీరోగా చేసిన అభిజిత్( Abhijith )మాత్రం ఇప్పటికీ స్టార్ గా మారలేకపోయాడు.బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి కూడా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాడు.

దాని తర్వాత వచ్చిన పాపులారిటీతో కొన్ని వెబ్ సిరీస్ లు చేశాడు కానీ పెద్దగా గుర్తింపు రాలేదు.సినిమాల గురించి పూర్తిగా తెలిసిన తర్వాత దీనిపై ఏకాగ్రత పెడతానని ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు.

కానీ తన తోటి వాళ్ళందరూ సక్సెస్ అవుతుంటే అభిజిత్ ఇంకా అర్థం చేసుకునే దశలోనే ఉండటం బాధాకరం.

తాజా వార్తలు