Color Helmets : రకరకాల రంగుల హెల్మెట్స్ ఎందుకు? వేటికి సంకేతం!

మీరు చాలా చోట్ల రంగు రంగులో వున్న హెల్మెట్‌లు ధరించిన వ్యక్తులను చూసే వుంటారు.భద్రత దృష్ట్యా వారు వాటిని ధరిస్తూ వుంటారు.

ఇవి చూడటానికి పెద్దగా కనిపించినప్పటికీ పెద్దగా భారం ఉండదు.తలను రక్షించడానికి వీటిని ఉపయోగించడం వారి విధులలో ఓ భాగం.

అయితే వాటి రంగులు ఎందుకు భిన్నంగా ఉంటాయన్న సందేహం చాలామందిలో ఉంటుంది.అందువలన కార్మికులు ఇటువంటి హార్డ్ టోపీని ఎందుకు ధరిస్తారు మరియు వివిధ రంగులలో ఇవి ఎందుకు వుంటాయో తెలుసుకుందాం.దీని వెనక పెద్ద కథే వుంది.1930లలో అమెరికాలో పెద్ద ఎత్తున భవనాల నిర్మాణాలు జరిగాయి.అప్పుడే ఈ రంగు రంగుల హెల్మెట్ల ట్రెండ్ మొదలైందని చెబుతూ వుంటారు.

సేఫ్టీ హెల్మెట్‌లు భావన నిర్మాణ కార్మికులకు మాత్రమే మొదట తయారుచేశారట.కాగా వాటిని ఇప్పుడు వాటిని ఫ్యాక్టరీలలో కూడా ఉపయోగిస్తున్నారు.

Advertisement

సాధారణ ప్రజలు ఈ రంగుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.ఎందుకంటే ఎప్పుడైనా నిర్మాణ స్థలంలో వీరు ఉన్నట్లయితే లేదా ఏదన్న అపార్ట్మెంట్ లో మరమ్మతు పనులు జరుగుతున్నా వీటిని ధరిస్తే ఎంతో సురక్షితంగా వుంటారు.

ఇక రంగులు విషయానికొస్తే, తెల్లటి హెల్మెట్ వేసవిలో శరీరాన్ని, మనస్సును చల్లబరుస్తుంది.ఇది ధరించినవారు భావన నిర్మాణాలకు ప్లాన్ చేస్తారట.అలాగే నిర్మాణ పరిశ్రమలో మాన్యువల్ లేబర్‌ పనులు చేసేవారు సాధారణంగా పసుపు టోపీని ధరిస్తారు.

భారీ యంత్రాలను ఆపరేట్ చేయడం, గుంతలు తవ్వడం లేదా భౌతిక పనులు చేయడం వీరి పని.ఇక కార్పెంటర్లు, టెక్నికల్ ఆపరేటర్లు లేదా ఎలక్ట్రీషియన్లు అనబడేవారు నీలం రంగు టోపీలు ధరిస్తారు.ఇక గ్రీన్ హార్డ్ టోపీ అనేది సైట్‌లోని సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ లేదా ఆ సైట్‌కి వచ్చిన కొత్త ఉద్యోగి కోసం ఉద్దేశించబడింది.

పుష్ప 2 పై అంబటి కామెంట్స్ .. వారిని అరెస్ట్ చేయకపోవడంపై ఫైర్ 
Advertisement

తాజా వార్తలు