ఎంతో మంది నీ హీరోలు చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి హీరోగా సక్సెస్ కాలేదు ?

S.V.కృష్ణా రెడ్డి( S V Krishna Reddy ) అద్భుతంగా కథలు రాయగలడు.

మ్యూజిక్ కంపోజ్ చేయగలడు.

అంతకుమించి సినిమాలను డైరెక్ట్ చేయగలడు.అందుకే ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక గొప్ప డైరెక్టర్‌గా మిగిలిపోయాడు.

మాయలోడు, శుభలగ్నం, మావిచిగురు, పెళ్ళాం ఊరెళితే వంటి సూపర్ హిట్ సినిమాలను తీసి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.ఫాంటసీ కామెడీ మూవీ యమలీల( Yamaleela ) (1994)తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

ఈ సినిమా ద్వారానే పాపులర్ కమెడియన్ అలీ( Ali ) స్టార్ హీరో అయిపోయాడు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.

Advertisement

మామూలు కమెడియన్ ని స్టార్ హీరో చేయగలిగిగాడు ఎస్వీ కృష్ణారెడ్డి.కానీ ఆయన మాత్రం సక్సెస్ కాలేకపోయాడు.

నిజానికి ఎస్వీ కృష్ణారెడ్డి ఉగాది, అభిషేకం వంటి రెండు సినిమాల్లో హీరోగా నటించాడు.కానీ ఆయన సక్సెస్ కాలేకపోయాడు.అదే ఎందుకు అనే ప్రశ్న ఒక ఇంటర్వ్యూలో ఆయనకు ఎదురయింది.

దానికి ఎస్.వీ కృష్ణారెడ్డి సమాధానం చెబుతూ "సినిమాలో స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే బాగుంటే ఎవరైనా స్టార్ హీరో అయిపోతారు.ఒకానొక సమయంలో నాకోసం ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను కానీ అలాంటి కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయని అందరూ చెప్పడంతో దాన్ని పక్కన పెట్టేసా.

ఆ తర్వాత ఉగాది సినిమా తీశాను.అందులో నేనే హీరో.అది మంచి హిట్ అయింది.

ధనవంతులకు ఆ బ్రిటీష్ యూనివర్సిటీ స్ట్రాంగ్ వార్నింగ్..?
ధనవంతులకు ఆ బ్రిటీష్ యూనివర్సిటీ స్ట్రాంగ్ వార్నింగ్..?

వంద రోజులు ఆడింది.ఇందులోని పాటలు, మ్యూజిక్ చాలా బాగుంటాయి.

Advertisement

అందువల్లే ఇది హిట్ అయింది."

"అయితే అభిషేకం సినిమాకు వచ్చేసరికి నేను శాటిస్ఫై కాలేదు.అభిషేకం సినిమా( Abhishekam ) టీవీలో హిట్ అయింది కానీ ఆ రోజుల్లో మాత్రం మంచిగా ఆడలేదు.హీరోగా మనం మంచిగా చేయలేకపోయామని ఒక భావన వచ్చింది.

మనుషులన్న తర్వాత తప్పటడుగులు వేయడం కామన్.నేను హీరోగా నటించి తప్పు చేశాను.

ఆ తర్వాత నా మిస్టేక్ తెలుసుకొని ఇక హీరోగా చేయకూడదని డిసైడ్ అయ్యా.నేను హీరోగా నటించిన రెండు సినిమాలకు నేనే నిర్మాత.

ఎవరి చేత డబ్బులు పెట్టించలేదు.ఎవరికీ నష్టం కలిగించలేదు.

హీరోగా సక్సెస్ కాలేకపోవడానికి ప్రధాన కారణం నేను గొప్ప నటుడిని కాదు.మహానటుడిని అసలే కాదు.

శ్రీకాంత్, జగపతి బాబు గొప్ప నటులు.వారిలాగా నేను గొప్ప యాక్టర్ కాలేనని నాకు తెలుసు.

కానీ హీరోగా చేయాలని మాత్రం నాకు ఒక ఆలోచన వచ్చింది.అందుకే చేసేసాను.

అందులో మనం సక్సెస్ అయ్యేమా లేదా వేరే విషయం.మనలో ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని అమలపరచడమే ముఖ్యం.

అదే నేను చేశాను." అని ఎస్‌వీ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

తాజా వార్తలు