కీర్తి సురేష్ గురించే ఎందుకు ఇన్ని పుకార్లు?

మహానటి ఫేం కీర్తి సురేష్( Keerthy Suresh ) హీరోయిన్ గా ప్రస్తుతం బిజీ బిజీగా ఉంది.

తెలుగు లో రెండు మూడు సినిమాలు చేస్తూ ఉండగా తమిళంలో అదే స్థాయి లో వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే.

హీరోయిన్ గా ఎంతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ పెళ్లి వార్తలు ఎన్ని సార్లు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సోషల్‌ మీడియా లో కీర్తి సురేష్ యొక్క పెళ్లి వార్తలు( Keerthy Suresh Marriage ) విని విని అభిమానులతో పాటు అంతా కూడా విసిగి పోయారు.

ఆ తర్వాత ఈమె పొలిటికల్‌ ఎంట్రీ గురించి వార్తలు వస్తున్నాయి.కీర్తి సురేష్ ఆ మధ్య బీజేపీ లో( BJP ) చేరే అవకాశా లు ఉన్నాయి అంటూ వార్తలు వచ్చాయి.

ఆమె తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు ఓకే చెప్పారు అనే వార్తలు కూడా వచ్చాయి.కానీ ఇప్పటి వరకు ఆమె బీజేపీ వంక కూడా చూడలేదు.కీర్తి సురేష్ యొక్క తల్లి ఆ సమయంలోనే తన కూతురు రాజకీయ ఎంట్రీ అంటూ వస్తున్న వార్తలు నిజం కాదని పేర్కొన్నారు.

Advertisement

అంతే కాకుండా కీర్తి సురేష్ ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలని ఆశ పడుతుందని వార్తలు వస్తున్నాయి.

తనకు ఆప్తుడు మరియు మిత్రుడు అయిన ఉదయనిధి స్టాలిన్( Udayanidhi Stalin ) పార్టీ డీఏంకే లో కీర్తి సురేష్ జాయిన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె హీరోయిన్‌ గా నటిస్తూనే రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి.భారీ ఎత్తున కీర్తి సురేష్ యొక్క రాజకీయ చర్చ జరుగుతున్న కారణంగా ఈసారి ఆమె నుండి ఎలాంటి ప్రకటన వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇంతకు ఈ ప్రచారం ఎందుకు మొదలు అయ్యింది అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు