Sarath Babu : శరత్ బాబు జీవితం లో ఎంత మంది ఆడవాళ్ళూ ఉన్నారు .. పిల్లలు మాత్రం వద్దు

గత రెండు మూడు రోజులుగా జయలలిత ( Jayalalithaa )అనే నటి తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఎన్నో ఇబ్బందులను అలాగే పెళ్లి చేసుకున్న విధానం, ప్రేమలో మోసపోయిన తీరు, ఇండస్ట్రీలో ఒక రోజు పడక సుఖం కోసం ఎలా హింస పెడతారు అనే విషయాలను చాలా స్పష్టంగా చెప్పింది.

అలాగే అందులో మగవాళ్ళ వైఖరి గురించి స్ట్రెయిట్ గానే వివరించింది.

రాత్రి తలుపు కొడతారు పొద్దున్నే మరిచిపోతారు అంటూ ఆమె స్పష్టమైన అభిప్రాయాలను చూసిన తర్వాత ఇండస్ట్రీ పైన చాలామందికి వెగట పుట్టింది.ఇక అన్నిటికన్నా హైలైట్ విషయం ఏమిటి అంటే ఆమెకు శరత్ బాబుతో( Sarath Babu ) ఉన్న సంబంధం.

తాము ఇద్దరం కలిసి ప్రేమలో పడ్డామని, బాగా తిరిగామని పిల్లల్ని కనాలని కూడా ప్లాన్ చేశామని ఆమె చెప్పడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది.

అందులో అబద్ధం లేదు ఖచ్చితంగా జయలలిత చెబుతుందంతా వాస్తవమే.అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం జయలలిత తన జీవితంలో పడిన కష్టనష్టాల గురించి కాదు శరత్ బాబు నిజంగా ఇలా ఒక రహస్య జీవితాన్ని ఎందుకు గడిపాడు అని.రమ ప్రభ( Rama Prabha ) కూడా ఎప్పుడు శరత్ బాబు తనను తన డబ్బులు వాడుకున్నాడని, కెరియర్లో ఎదిగేందుకు తన పేరును కూడా వాడుకున్నాడని గగ్గోలు పెడుతూనే ఉన్నారు.చాలా ఏళ్లపాటు కలిసి కాపురం చేసిన వీళ్ళిద్దరూ పిల్లల్ని కనలేదు.

Advertisement

ఆ ఆలోచన కూడా తమకు రాలేదు అని చెబుతూ ఉంటుంది.జయలలిత ( Jayalalitha )కూడా ఇంచుమించు ఇలాంటి సమాధానమే చెప్పింది.

ఆమె పిల్లల్ని కనాలని అనుకున్నా కూడా మనం ఇద్దరం లేకపోతే ఆ పుట్టిన పిల్లలు అనాధలు అవుతారు కాబట్టి పిల్లలు వద్దు అని శరత్ బాబు చెప్పేవారని చెబుతుంది.శరత్ బాబుకి ప్రేమ పెళ్లి వరకు ఓకే కానీ పిల్లల్ని కనడానికి మొదటి నుంచి ఇష్టపడలేదు అని ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత అర్థమవుతుంది.

ఆయన రమాప్రభ, జయలలిత జీవితాల్లోనే కాదు.ఆ తర్వాత మరో రెండు వివాహాలు చేసుకున్నాడు.అయినా కూడా ఎవరితో సంతానాన్ని కన్నట్టుగా ఎక్కడ వార్తలు లేవు.

శరత్ బాబు మొదటి నుంచి పిల్లలకు వ్యతిరేకంగా ఉన్నాడా ఏంటి అని అనుమానం రాకమానదు.పైగా ఇంతమంది జీవితాల్లో అతడి పాత్ర కూడా ఎన్నో సందేహాలకు ఊతమిస్తోంది.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

ఒక మనిషి ప్రేమలో పడటం పెళ్లి అనేది ఒకటి రెండు సార్లు జరిగితే బాగానే ఉంటుంది.కానీ లెక్కకు మించి జరిగితేనే అతనిలో ఏదో ఒక లోపం ఉందని అందరికీ అర్థమైపోతుంది.

Advertisement

శరత్ బాబు కూడా బయటకు కనిపించే అందమైన జీవితాన్ని గడపలేదు.అతడికి ఒక్కో దశలో ఒక్కో రహస్య ప్రేమ కథ ఉండటం నిజంగా ఆశ్చర్య గురిచేస్తుంది.

తాజా వార్తలు