తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలు రోజురోజుకీ బాగా దిగజారుతున్నారు.ఒకప్పుడు రాజకీయ నేతలంటే ఎంతో గౌరవం ఉండేది కానీ ఇప్పుడు వారంటేనే అసహ్యం పుడుతోంది.
ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా వాళ్లు చేస్తున్న చిల్లర వ్యాఖ్యలు, విమర్శలు పరమ వికారంగా, ఏవగింపు కలిగించేలా ఉంటున్నాయి.అందుకు తాజా ఉదాహరణ తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ(Women Minister Konda Surekha).
ఆమె చేసిన తాజా కామెంట్స్ తెలంగాణ రాజకీయాల స్థాయిని మరింత కింది స్థాయికి తీసుకొచ్చాయి.ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ అంటేనే వెగటు, కంపు వాసన కొడుతున్నాయి.
మహిళా రాజకీయ నేతలూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే చాలామందిలో కలవరం పుడుతోంది.అసలు దీని కంటే ముందు ఏం జరిగిందంటే, అంటే కొండా సురేఖ సమంత(konda surekhs, Samantha ), కేటీఆర్ల(KTR) గురించి మాట్లాడక ముందు సురేఖపై నీచమైన స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి.
ఇటీవల బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మంత్రి కొండా సురేఖ మెడలో చేనేతలు నూలు దారంతో తయారు చేసిన దండ వేశారు.ఆమె దుబ్బాక వచ్చి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
ఆ సందర్భంగా ఇలా దండ వేయడం జరిగింది.అయితే ఆ దండ వేసే క్రమంలో వీరు కలిసి ఫోటోలు తీసుకున్నారు.
ఆ ఫోటోలను తీసుకుని కొంతమంది "వీరికి షాదీముబారక్ ఎవరు ఇచ్చారు?" అని అసభ్యకరంగా పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశారు.ద్వందార్థం వచ్చేలా పోస్టులు పెట్టి మంత్రి కొండా సురేఖను ట్రోల్ చేశారు.
ఇంతటి అసభ్యకరమైన ట్రోలింగ్ చూడలేక మంత్రి కొండా సురేఖ కన్నీళ్లు పెట్టుకున్నారు, మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.సురేఖను ట్రోల్ చేసిన వారిలో చాలామంది ప్రొఫైల్ ఫోటోల్లో హరీష్ రావు చిత్రాలు పెట్టుకున్నారట.ఆయనే వీరిని ఉసిగొల్పారా అనే కోణంలో చర్చ జరిగిన నేపథ్యంలో హరీష్ రావు కొండా సురేఖని(Harish Rao ,Konda Surekhani) ట్రోల్ చేయడాన్ని ఖండిస్తున్నా అని అన్నారు.
కేటీయార్ మాత్రం దీనిపై సరిగా రియాక్ట్ అవలేదు.కొండా సురేఖవి దొంగ ఏడుపులు, పెడబొబ్బలు అంటూ ఎగతాళి చేశారు.ఆమెపై ట్రోలింగు ఓ నీచ స్థాయిలో జరుగుతుంటే దానిని ఆయన సమర్థించినట్లుగా మాట్లాడారు.
ఆ మాటలు విన్నాక సురేఖ పూర్తిగా కంట్రోల్ తప్పి కేటీయార్‌పై దారుణమైన విమర్శలు, అలిగేషన్స్ చేశారు.
కేటీఆర్ సినీ హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేయించేవారని, ఆపై వాళ్లను బెదిరించి, శారీరకంగా వాడుకునే వారిని, డ్రగ్స్‌కు అలవాటు కూడా చేయించారని సంచలన అలిగేషన్స్ చేశారు.చివరకు చైతన్య, సమంత విడాకులకు కూడా ఈ కేటీయార్(KTR) లైంగిక డిమాండ్సే కారణమని అన్నారు.సురేఖకు కడుపు మండి కేటీఆర్ మీద విమర్శలు చేసారానుకుందాం కానీ దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి.
ఎదుటివారు సంస్కారహీనమైన ట్రోలింగ్ చేశారని, విమర్శలు చేశారని ఈమె కూడా సంస్కారం మరిస్తే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు.కొండా సురేఖ చాలా పెద్ద తప్పే చేశారు.
సమంతను, అక్కినేని ఫ్యామిలీని(Samantha ,Akkineni family) బజారుకు లాగారు.వీళ్లపై అనవసరంగా కామెంట్స్ చేయాల్సిన అర్హత ఆమెకు లేదు కాబట్టి ఇప్పుడు ఎవరూ కూడా ఆమె పక్షాన నిలబడటం లేదు.
ఆమె తన మాటలతో సమంతను అనవసరంగా బజారున నిలబెట్టింది.కేటీఆర్ మీద కోపం ఉంటే ఆయన పేరు ఒక్కటే చెబుతూ విమర్శించాలి.మధ్యలో ఒక ఆడబిడ్డ అయిన సమంతను తీసుకురావడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు.
ఓ మహిళా మంత్రి కాబట్టి ప్రతి మాట చాలా సెన్సిబుల్‌గా మాట్లాడాలి, సెన్సిటివ్ మ్యాటర్ మాట్లాడుతున్నప్పుడు ఎవరినీ నొప్పించకుండా మాట్లాడాలి.తనపై ట్రోలింగ్ చేస్తే ప్రభుత్వంలో ఉన్నది వాళ్లే కాబట్టి వారిని శిక్షించాలి.
మరీ చేతగాని ప్రభుత్వంలా ఏడ్చేస్తే ఏం లాభమని చాలామంది ప్రశ్నిస్తున్నారు.ఒకవేళ కేటీఆర్ కొండా సురేఖ చెప్పినట్లే సినిమా హీరోయిన్లపై అరాచకాలకు పాల్పడి ఉంటే విచారణ, దర్యాప్తు జరపాలి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయడం లేదు.
కేటీఆర్ (KTR) తమను మోసం చేసినట్లు చెప్పడానికి ఇప్పటిదాకా ఒక్క మహిళ కూడా ముందుకు రాలేదు.ఆయన ఎలాగూ ప్రభుత్వంలో లేరు కాబట్టి ఆ పని చేయొచ్చు కానీ ఎవరూ కంప్లైంట్ ఇయ్యలేదు.ఎలాంటి ఆధారాలు, బాధితురాలి వాంగ్మూలాలు లేకుండా సురేఖ ఇలాంటి ఆరోపణలు ఎలా చేశారు? ఆమె దగ్గర కేటీఆర్ తప్పు చేసినట్లు నిరూపించే డేటా ఉంటే దాన్ని బయట పెట్టవచ్చు కదా? ఏమీ చేయకుండా మీడియా ముందు ఇలా సమంత గురించి మాట్లాడటం నిజంగా అంగీకరించదగిన విషయం కాదు.చివరికి తాను చెప్పిన మాటలు వాస్తవమే అని కొండా సురేఖ (konda surekha )అధిష్టానం ముందు ఒప్పుకుంటారా, అలా ఒప్పుకుంటే కేటీఆర్ మీద ప్రభుత్వం విచారణ చేస్తుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy