Sekhar kammula : శేఖర్ కమ్ముల అడిగిన సాయి పల్లవి నటించని ఆ సినిమా ఏంటో తెలుసా ?

ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో వన్ అఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్స్ సాయి పల్లవి.

( Sai pallavi )మలయాళం చిత్రం ప్రేమమ్ తో సినీ పరిశ్రమకు పరిచయమిన ఈ అమ్మాయి శేఖర్ కమ్ముల( Sekhar kammula )దర్శకత్వం వహించిన "ఫిదా" ( Fidaa )చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది.

కానీ నిజానికి సాయి పల్లవికి ప్రేమమ్ కంటే ముందే సినిమాలలో నటించే అవకాశం వచ్చిందట.అది కూడా ఒక తెలుగు దర్శకుడు ఆఫర్ చేసాడట.

మరి ఆ దర్శకుడు ఎవరు? సాయి పల్లవి ని ఎలా గుర్తించాడు? అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం.

సాయి పల్లవి ఈటీవీ లో ప్రసారమైన ఢీ డాన్స్ షో నాలుగోవ సీజన్లో పాల్గొన్న విషయం మనందరికీ తెలిసినదే.ఈ షో 2010 లో ప్రసారమయ్యింది.ఆ సమయంలోనే మన తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల ఆమెను టీవీ లో చూసి ఇంప్రెస్స్ అయ్యాడట.

Advertisement

ఆ షోలో సాయి పల్లవి ఎప్పుడు సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా ఉండేది.ఆమె ఆ షో లో పెర్ఫర్మ్ చేసిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా (వర్షం), భూ భూ భుజంగం (అరుంధతి), వంటి పాటలు చాలా పాపులర్ అయ్యాయి.

అప్పుడు శేఖర్ కమ్ముల లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ చిత్రా( Life is Beautiful )న్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు.అందులో ఒక పాత్రకు సాయి పల్లవిని చాష్త్ చేసుకుందాం అనుకున్నారట.

వాళ్ళ అమ్మ గారికి ఫోన్ చేసి పర్మిషన్ కూడా అడిగారట.కానీ ఆ షో పూర్తి అయినా వెంటనే ఆమె మెడిసిన్ చదివేందుకు జార్జియా వెళ్ళిపోయింది.

ఇలా సాయి పల్లవి తన చదువు కారణంగా తనకు వచ్చిన మొదటి సినిమా అవకాశాన్ని చేజార్చుకుంది.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

తరువాత ఆమె జార్జియాలో మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలో ప్రేమమ్( Premam ) టీం ఆమెను కాంటాక్ట్ చేశారట.కానీ సాయి పల్లవి మాత్రం తన చదువు పూర్తవడానికి మరో ఆరు నెలలు పడుతుందని, అది పూర్తయ్యాకే వస్తానని ఖరాఖండిగా చెప్పేసిందట.ఆ డైరెక్టర్ కూడా తొందరేమీ లేదని, వచ్చే వరకు వెయిట్ చేస్తామని చెప్పారట.

Advertisement

ఆలా ఆమె జార్జియాలో చదువు పూర్తి చేసి వచ్చాక ప్రేమంలో నటించింది.కానీ తెలుగులో మాత్రం మళ్ళి శేఖర్ కమ్ముల ద్వారానే పరిచయమయింది.

తాజా వార్తలు