రవిబాబు సినిమాలు ఎందుకు సక్సెస్ కావడం లేదంటే..?

నటుడు చలపతి రావు కొడుకు గా ఇండస్ట్రీ కి వచ్చిన రవిబాబు ( Ravibabu ) మొదట నటుడిగా సినిమాల్లో నటించాడు విలన్ గా చేస్తూనే ఆ తరువాత కామెడీ కూడా చేసాడు ఇక అల్లరి నరేష్ ని హీరోగా పెట్టి ఆయన తీసిన అల్లరి ( Allari movie ) అనే సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది ఈ సినిమాతోనే నరేష్ కి అల్లరి నరేష్ అనే పేరు వచ్చింది ఈ సినిమా తరువాత కూడా ఆయన చాలా సినిమాలకి డైరెక్షన్ చేసి డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.

వరుసగా పార్టీ,అమ్మాయిలు అబ్బాయిలు,అనసూయ, అమరావతి, నచ్చావులే లాంటి సినిమాలు తీసి ఇండస్ట్రీ లో ఒక మంచి టేస్ట్ ఉన్న దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు.

అయితే ఆయన గత కొద్దీ రోజులుగా సినిమాలు చేయడం లో చాలా ఆలస్యం చేస్తున్నట్టు తెలుస్తుంది.అందుకే ఆయన నుంచి ఈ మధ్య సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి.ఇక మీదట కూడా ఆయన నుంచి సినిమాలు రావాలి అంటే ఇంకా కొద్దీ రోజులు వెయిట్ చేయక తప్పదు అని తెలుస్తుంది అయితే రీసెంట్ గానే వాళ్ల నాన్న అయిన చలపతి రావు గారు( Chalapathi rao ) చనిపోవడం తో ఆయన ఆ బాధలో ఉన్నట్టు తెలుస్తుంది.

ఆ భాద లో నుంచి తొందరగా బయటపడి మళ్లీ సినిమా చేయాలి అని ఆయన అభిమానులు అనుకుంటున్నారు.నిజంగా ఆయన సినిమాలకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

ఆయన ఒక జానర్ అని కాకుండా అన్ని జానర్స్ లో సినిమాలు చేస్తూ మంచి హిట్స్ అందుకున్నారు.

Advertisement

రవిబాబు అప్పుడపుడు సినిమాల్లోకనపడి మంచి కామెడీ ని కూడా పంచుతూ ఉంటాడు.రవిబాబు కామెడీ ని ఇష్టపడే అభిమానులు కూడా ఉన్నారు అందుకే ఇప్పటికి ఆయన థియేటర్లో కనిపిస్తే విజిల్స్ పడుతుంటాయి.ముఖ్యంగా ఆయన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చేసిన గూడి రాజు క్యారెక్టర్ కి మంచి పేరు వచ్చింది.

అయితే ఆయన మళ్లీ ఒక మంచి సినిమాకి డైరెక్షన్ చేసి మన ముందుకు రావాలని కోరుకుందాం,.

Advertisement

తాజా వార్తలు