60 ఏళ్ల వయసు వస్తున్నా ఇంకా మీడియం రేంజ్ హీరోగానే మిగిలిపోయిన రవితేజ

సినిమా ఇండస్ట్రీపై ఉన్న ఆసక్తి కొద్ధి కన్నవారిని వదిలిపెట్టి హైదరాబాద్కు వచ్చేసి ఈ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించిన అనేక మంది లో రవితేజ( Ravi Teja ) కూడా ఒకడు.1990 నుంచి దాదాపు ఏడేళ్ల పాటు ఒంటరి ప్రయాణం చేశాడు.

చిన్న చిన్న వేషాలు వేస్తూ జూనియర్ ఆర్టిస్టులాగా కష్టపడ్డాడు.

అలా నటిస్తూ నటిస్తూ మొత్తానికి 1999లో మొట్టమొదటిసారి నీకోసం అనే చిత్రం ద్వారా హీరోగా మారాడు.ఈ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు రవితేజ ఎన్నో రోజులు కలలు కన్నాడు ఎంతో ఇబ్బంది పడ్డాడు అయితే అనుకున్నది మాత్రం సాధించాడు హీరో అయిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు పూరి జగన్నాథ్ ( Puri Jagannath )లాంటి ఫ్రెండ్స్ తో సూపర్ హిట్స్ కొట్టాడు స్టార్ హీరోగా అంచెలంచలుగా ఎదుగుతూ వచ్చాడు.

అయితే దాదాపు హీరోగా కూడా 60కి పైగా సినిమాల్లో నటించిన రవితేజ ఎందుకు ఇప్పటికే మీడియం రేంజ్ హీరో గానే మిగిలిపోయాడు.ఆయన సినిమాకి పెద్ద హీరోల సినిమాకి బడ్జెట్ విషయంలో కాస్త తేడా ఉన్న రెమ్యూనరేషన్( Remuneration ) విషయంలో చాలానే తేడా ఉంటూ వస్తుంది పైగా 50 కోట్లకు మించి అతడి మార్కెట్ లేదు అనే భ్రమలో 2001 వరకు మార్కెట్ ఉండిపోయింది అనుకున్నట్టుగానే మొట్టమొదటిసారి ధమాకా సినిమాతోనే ఆయన 100 కోట్ల క్లబ్లో చేరారు.కానీ ఇటీవల కాలంలో వస్తున్న చిన్న హీరోలు సైతం 100 కోట్లు అవలీలగా సాధిస్తున్నారు.

అయినా కూడా 20 ఏళ్ల పాటు నటించినా కూడా ఎందుకు రవితేజ అనుకున్న స్థాయిలో విజయాలు అందుకోలేదు అనేది మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిన విషయం.

Advertisement

ఒక్క హిట్టు కొడితే మూడు ప్లాపులు వరుసగా వస్తాయి అలాగే కలెక్షన్స్ కూడా అంతంత మాత్రమే సాధిస్తున్నారు ఒకప్పటి మాస్ రేంజ్ అతని చిత్రాల్లో ఉండట్లేదు మాస్ మహారాజ్ అనే పేరు సార్ధకం అయ్యే సినిమాలు తీయడం లేదు ఇప్పటికి ఇంకా అతడు మీడియం రేంజ్ హీరోగానే కొనసాగుతూ వస్తున్నాడు.ఆల్మోస్ట్ వయసు కూడా పెద్దది అయిపోయింది మరి ఇంకా టైర్ వన్ హీరోల సరసన చేరుతాడా అంటే అది పెద్ద అనుమానమే.ఇప్పటి హీరోలంతా ఫ్యాన్ ఇండియా అంటూ పరుగులు పెడుతున్నారు.

మరి రవితేజ మాత్రం ముక్కుతు ములుగుతూ విజయాలు అందుకుంటున్నారు.ఇలాగే కొనసాగితే మరికొన్ని సినిమాలతో రవితేజ కెరియర్ ముగిసిపోవడం ఖాయం.

Advertisement

తాజా వార్తలు