భార్యపై సీరియస్ అయిన రఘువరన్.. అసలు సంగతి తెలియడంతో అవాక్కయింది..?

టాలెంటెడ్ యాక్టర్ రఘువరన్( Raghuvaran ) తమిళ సినిమాల్లోనే కాకుండా తెలుగు సినిమాల్లో కూడా నటించి మెప్పించాడు.

నాని మూవీలో సైంటిస్ట్ పాత్రలో రఘువరన్ చూపించిన యాక్టింగ్‌కి అందరూ ఫిదా అయిపోయారు.

మాస్, అనగనగా ఒక రోజు లాంటి సినిమాల్లో కూడా రఘువరన్ ఛాలెంజింగ్ రోల్స్‌లో చాలా బాగా నటించి ఆకట్టుకున్నాడు.సింపుల్‌గా చెప్పాలంటే ఈ కేరళ నటుడు అదిరిపోయే యాక్టింగ్ స్టైల్, బ్రహ్మాండమైన వాయిస్ మాడ్యులేషన్‌తో ప్రేక్షకులకు ఫేవరెట్ గా మారాడు.

రఘువరన్ ప్రముఖ నటి రోహిణిని( Actress Rohini ) 1996లో పెళ్లి చేసుకున్నాడు.రోహిణి కూడా చాలా టాలెంటెడ్ యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు.ఆమె ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది.

భక్తకన్నప్ప, మగమహారాజు, స్త్రీ, బాహుబలి, ఇష్క్, రంగస్థలం, రైటర్ పద్మభూషణ్ వంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించింది.ఇప్పటికీ రోహిణి చాలా బిజీయస్ట్ యాక్ట్రెస్‌గా లైఫ్ లీడ్ చేస్తోంది.

Advertisement

అయితే రోహిణి పెళ్లి చేసుకుందాం పెళ్లి రోజుల్లో రఘువరన్ బిహేవియర్ చూసి షాక్ అయ్యేదట.రఘువరన్ పెళ్లి చేసుకోవడానికి ముందు రోహిణి తో చాలా కూల్‌గా మూవ్ అయ్యే వాడట.

కానీ పెళ్లయిన తొలి రోజుల్లో అతడి బిహేవియర్ లో చాలా మార్పు వచ్చిందట.చాలా సీరియస్ గా, అగ్రెసివ్ గా అతడు మాట్లాడుతుంటే రోహిణి భయపడి పోయిందట.

పెళ్లయిన కొత్తలోనే రఘువరన్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అని ఆమె చాలా బాధపడిపోతుంటే రఘువరన్ తల్లి ఈ విషయాన్ని గ్రహించిందట.ఏంటి సంగతి అని అడిగితే రఘువరన్ బిహేవియర్ గురించి తెలియజేసిందట.దానికి రఘువరన్ తల్లి బదులిస్తూ "ముందు అతడు ఏ క్యారెక్టర్ పోషించబోతున్నాడో తెలుసుకో.

అప్పుడు నీకే అతను ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో అర్థమవుతుంది." అని చెప్పిందట.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా

అప్పుడు రఘువరన్ ఒక సీరియస్ రోల్ చేయబోతున్నాడని రోహిణి తెలుసుకుంది. షూటింగ్ సెట్స్‌లోకి వెళ్లడానికి ముందే రఘువరన్ తన క్యారెక్టర్ లోకి ప్రవేశిస్తాడు.

Advertisement

అది అతని డెడికేషన్ కి ఒక నిదర్శనం.ఈ సంగతి తెలిసి రోహిణి ఆశ్చర్యపోయిందట.

అకారణంగా రఘువరన్ సీరియస్ అయ్యాడంటే అది అతను తన క్యారెక్టర్ ను ప్రాక్టీస్ చేస్తున్నాడని అర్థం తప్ప నిజంగానే కోప్పడుతున్నాడని కాదు అని రోహిణి రియలైజ్ అయింది.రఘువరన్ 2008న మరణించాడు.

అతిగా మద్యం సేవించడం వల్ల ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి అతను చనిపోయాడు.రోహిణి, రఘువరన్ 2004లో డివోర్స్ తీసుకున్నారు.

వారిద్దరికీ ఒక కుమారుడు ఉన్నాడు.ఆ అబ్బాయి పేరు రిషి వరణ్.

తాజా వార్తలు