ఆ తండ్రీకొడుకులు సినిమాల్లో తోపులు.. కానీ ఆ డైరెక్టర్ అంటేనే పరమ అసూయ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్లు ఎందరో ఉన్నారు.వి.

వి వినాయక్, ఎస్ఎస్ రాజమౌళి, పూరీ జగన్నాథ్, సుకుమార్ ( VV Vinayak, SS Rajamouli, Puri Jagannath, Sukumar )లాంటి దర్శకులు మాస్ ఆడియన్స్‌ను ఎలా థియేటర్లకు రప్పించాలో బాగా తెలిసినోళ్లు.

వీళ్ల సినిమాలు చూస్తుంటే గూస్‌బంప్స్‌ వస్తాయి.

ఈ సినిమాల్లో ఒక్కో డైలాగ్ తూటలాగా హీరో నోటి నుంచి పేలుతుంది.పోకిరి, మగధీర సినిమాలతో రాజమౌళి, పూరీ ఇండస్ట్రీ హిట్స్ కొట్టారు.

రాజమౌళి ఎన్నో రోజుల కష్టపడి, చాలా బడ్జెట్ పెట్టి బాహుబలి తీస్తే అది ఇండస్ట్రీ హిట్ అయింది.కానీ పూరి జగన్నాథ్ మాత్రం "ఎవడు కొడితే దిమ్మతిరిగి పోతుందో వాడే పండుగాడు, "నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజన్‌లో ఎక్కువగా కొట్టేస్తా" వంటి మాస్ డైలాగులతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.

Advertisement

పోకిరి సినిమా బాగుంటుంది కానీ దానిని చాలా తక్కువ సమయంలోనే పూరీ తీసేసి భారీ ఇండస్ట్రీ హిట్ సాధించాడు.ఇప్పుడంటే వరుసగా ఫ్లాప్స్‌తో పూరి జగన్నాథ్ సతమతమవుతున్నాడు కానీ అప్పట్లో ఆయన చాలా తక్కువ సమయంలో అద్భుతమైన మాస్ సినిమాలు తీసి బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు.

బాహుబలి 2, ఆర్‌ఆర్ఆర్ ( Baahubali 2, RRR )తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎస్.ఎస్ రాజమౌళి రాణిస్తున్నాడు.కానీ ఇప్పటికీ పూరి జగన్నాథ్ ( Puri Jagannath )అంటే ఆయనకు అసూయే ఆట.సుకుమార్ సైతం పూరీ జగన్నాథ్ లాగా ఊర మాస్ కథలు, సన్నివేశాలు, డైలాగులు నేను ఎందుకు రాయలేకపోతున్నాను అంటూ అసూయపడతాడు.వి.వి వినాయక్ కూడా పలు ఇంటర్వ్యూల్లో పూరిలాగా మాస్‌ సినిమాలు తీయాలనుకున్నా తీయలేకపోతున్నామని చెప్పుకొచ్చాడు.

రాజమౌళి కూడా సేమ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటాడు.ఒకసారి బిజినెస్‌మెన్ సినిమా ఫంక్షన్‌లో పూరి జగన్నాథ్ ని ఉద్దేశించి "మీ దగ్గర రెండు రోజులు అసిస్టెంట్ డైరెక్ట్ గా పనిచేయనివ్వండి.

మా భార్య మీరు చాలా తక్కువ టైంలోనే ఇండస్ట్రీ హిట్స్ కొడుతున్నారని నన్ను తిడుతుంటుంది.మిమ్మల్ని చూసి నేర్చుకోమని సలహా ఇస్తుంటుంది.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

అందుకే ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వండి" అని రిక్వెస్ట్ చేశాడు.ఆ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.

Advertisement

పూరీ, రాజమౌళి దాదాపు ఒకే టైమ్‌లో ఇండస్ట్రీలో అడుగు పెట్టినా తొలత పెద్ద హిట్లు అందుకుంది మాత్రం పూరీ జగన్నాథే.రాజమౌళి ఒక్క హిట్టు తీస్తే పూరీ మూడు-నాలుగు హిట్స్ సాధించేవాడు.రాజమౌళి సంవత్సరాల తరబడి ఒక్క సినిమానే తీస్తుంటే, ఆయన మాత్రం ఒక్క సంవత్సరంలోనే రెండు మూడు సినిమాలు పట్టాలెక్కిస్తుంటాడు.

స్క్రిప్టు, బడ్జెట్ అన్నీ కూడా పక్కగా ఉంచుకొని మూవీని త్వరగా కంప్లీట్ చేస్తాడు.రాజమౌళి ఒకానొక సందర్భంలో ఆశ్చర్యపోతూ అంత త్వరగా స్క్రిప్ట్ ఎలా రాస్తారు, షూటింగ్ ఎలా కంప్లీట్ చేస్తారు అని ప్రశ్నించాడు.

దానికి ఏదైనా ట్రిక్ ఉంటే చెప్పాలంటూ కోరాడు.రాజమౌళి తండ్రి, స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్( Writer Vijayendra Prasad ) సైతం తనకు పూరీ అంటే పరమ అసూయ అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఇంకో విశేషమేంటంటే తన మొబైల్ స్క్రీన్ సేవర్ గా పూరీ ఫొటోనే సెట్ చేసుకున్నాడు.

పూరీ చాలా గొప్ప రైటర్ అని, ఆయన సినిమాలు చూస్తుంటేనే తనుకు ఉత్సాహం కలుగుతుందని తెలిపాడు.ఇండియాలోనే టాప్ రైటర్ గా ఉన్న విజయేంద్రప్రసాద్ ఇలా పూరీ జగన్నాథ్ చూసి తనకంటే గొప్పవాడు అన్నట్టు మాట్లాడటం అందర్నీ ఆశ్చర్యపరిచింది.ప్రొఫెషనల్‌గా ఆయన పట్ల అసూయ వ్యక్తం చేయడం విశేషంగా నిలిచింది.

మొత్తం మీద తండ్రీకొడుకులు తోపులైనా సరే పూరీ జగన్నాథ్ టాలెంట్ ని చూసి అసూయ పడుతున్నారు.

తాజా వార్తలు