CM Jagan Siddham Meeting : సైకిల్ ను తోయడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకు..: సీఎం జగన్

అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలో( Siddham Meeting ) సీఎం జగన్( CM Jagan ) కీలక వ్యాఖ్యలు చేశారు.

మ్యానిఫెస్టోలో 99 శాతం వాగ్దానాలను అమలు చేసి ఎన్నికలకు వెళ్తున్నామని తెలిపారు.

జగన్ మార్క్ ప్రతి గ్రామంలో కనిపిస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు( Chandrababu ) ఓటు ఎందుకు వెయ్యాలని ప్రశ్నించారు.జగన్ పాలనలో మంచి చెయ్యలేదని చంద్రబాబు నమ్మితే వాళ్లకు పొత్తులు ఎందుకో చెప్పాలన్నారు.

చంద్రబాబుకు ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకన్న సీఎం జగన్ సైకిల్ ను తోయడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకని అడిగారు.

ఈ 57 నెలల కాలంలో 125 సార్లు బటన్లు నొక్కానని తెలిపారు.ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలు రెండు బటన్లు నొక్కాలని చెప్పండన్నారు.ఇందులో ఒకటి అసెంబ్లీకి, మరొకటి లోక్ సభకని పేర్కొన్నారు.

Advertisement

మీకు మంచి జరిగితేనే తనకు సైన్యంలా నిలవాలని చెప్పండన్నారు.అన్ని వర్గాలు కదలిరావాలన్న సీఎం జగన్ స్టార్ క్యాంపెయినర్లు కావాలని సూచించారు.

చంద్రబాబుకు ఓటు వేయడం అంటే డీబీటీకి వ్యతిరేకంగా ఓటు వేయడమేనని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు