మన వాళ్ళకే నేషనల్ అవార్డ్ కానీ మనకు కాదు... ఇదేం దరిద్రం రా బాబు

తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి, పుష్ప, రంగస్థలం, విరూపాక్ష, హనుమాన్, బింబిసార వంటి చాలా మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి కానీ అవార్డ్స్ విషయంలో మాత్రం చిన్న సినిమా ఇండస్ట్రీల కంటే కూడా వెనుక పడుతోంది.

ఈమధ్య రిలీజ్ అయిన నేషనల్ ఫిలిం అవార్డ్స్‌లో( National Film Awards ) ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా అవార్డు గెలుచుకోలేకపోయింది.కార్తికేయ-2( Karthikeya 2 ) సినిమాకు అవార్డు వచ్చింది కానీ అది ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా అవార్డు విన్ అయింది.అంటే ఏదో ఒక తెలుగు సినిమాకి అవార్డు ఇవ్వాల్సిందే.

అందుకే దీనికి ఇచ్చారు.అంతేతప్ప, మెచ్చుకుని కార్తికేయ 2 సినిమాకి అవార్డు ఇవ్వలేదని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు.

అంటే నేషనల్ అవార్డ్స్ లో ఒక అవార్డు గెలుచుకున్నామని కాలరేగరేసుకొని చెప్పుకునే పరిస్థితి లేదు.ఇది నిజంగా సిగ్గుచేటు అని చెప్పుకోవచ్చు.

రాజమౌళి,( Rajamouli ) సుకుమార్,( Sukumar ) త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దిగ్గజ దర్శకులు మన టాలీవుడ్ లో ఉన్నారు.క్రియేటివిటీకి కూడా కొదవలేదు.నేషనల్ అవార్డు విన్నింగ్ లెవెల్ లో యాక్ట్ చేసే యాక్టర్స్ కూడా ఉన్నారు.

Advertisement

బాగా కష్టపడే తత్వం కూడా ఉంది.కానీ మన వాళ్ళు సినిమాని ఒక ఆర్ట్ లాగా చూడటం లేదు.

కమర్షియల్ సినిమాలకే మొగ్గుచూపుతున్నారు.మాస్ మసాలా సినిమాలు తీస్తూ కాలం గడిపేస్తున్నారు.

బిల్డప్‌లు తప్ప కంటెంట్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టడం లేదు.ఒక సక్సెస్ ఫార్ములా పట్టుకొని పోలోమని సినిమాలు తీస్తున్నారు.

స్టార్‌డమ్ అయితే వస్తుంది కానీ నేషనల్ లెవెల్లో అవార్డ్స్ మాత్రం రావడం లేదు.

అమ్మమ్మ చేసిన దారుణం.. 37 ఏళ్ల తర్వాత చైనీస్ కపుల్‌కు విముక్తి..?
వరుణ్ తేజ్ లాంటి భర్త దొరకడం లావణ్య అదృష్టమే.. భార్యపై ప్రేమతో ఏకంగా అలా చేస్తారా?

టాలీవుడ్ దర్శకులు, స్టార్ హీరోలు సినిమా అంటే ఇంకా చెత్త డ్యాన్స్ స్టెప్పులు, బూతు పాటలు, వెగటు కథలు, వెకిలి మాటలు, పిచ్చి పిచ్చి ఫైట్లు, దిక్కుమాలిన కామెడీ అనుకుంటున్నారు.ఒక మంచి కథతో సినిమా తీద్దామనే ఆలోచన ఎవరికీ రావడం లేదు.ఏదో ప్రయోగం చేయాలి అన్నట్లు దిక్కుమాలిన సినిమాలు తీస్తున్నారు తప్ప కోలీవుడ్, మాలీవుడ్ దర్శకుల లాగా మంచి సినిమా చేయలేకపోతున్నారు.

Advertisement

నిజం చెప్పాలంటే తెలుగు నిర్మాతలకు( Tollywood Producers ) మూవీ కలెక్షన్స్ ముఖ్యం.వాళ్లకు సినిమా అంటే ఒక వ్యాపారం, ఒక పెట్టుబడి, డబ్బులు ముద్రించే ఒక మార్గం.ఇలాంటి ఆలోచన ఈసారి నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో ఒక్క సినిమా కూడా జాతీయ పురస్కారాన్ని దక్కించుకోలేకపోయింది.

ఇప్పటికైనా మన వాళ్ళు సిగ్గుపడాల్సిన అవసరం ఉందని చాలామంది కామెంట్ చేస్తున్నారు.మిస్టర్ బచ్చన్ సినిమా చూస్తే అందులో సిగ్గుమాలిన స్టెప్పులు ఉన్నాయి.ఆ క్రియేటివిటీ హీరోయిన్లతో స్టెప్పులు వేసే దానిపై కంటే కథలో చూపిస్తే చాలా బాగుంటుంది.

తమిళ, మలయాళ, హిందీ, కన్నడ సినిమాలు అసలైన టాలెంట్ తో నేషనల్ ఫిలిం అవార్డ్స్‌లో బాగా పోటీ పడ్డాయి.నిత్యామేనన్‌( Nithya Menon ) నుంచి తమిళ దర్శకులు అదిరిపోయే యాక్టింగ్ పెర్ఫార్మన్స్ రాబట్టగలిగారు.

అందుకే ఆమెకు ఈసారి అవార్డు వచ్చింది.తమిళ సినిమానే రెహమాన్‌కు బెస్ట్ బీజీఎం అవార్డు తెచ్చి పెట్టింది.

అలానే తమిళ సినిమానే మన జానీ మాస్టర్‌కు పురస్కారాన్ని అందించింది.మనవాళ్లు టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు కానీ ఆ టాలెంట్ ని వెలికి తీయకుండా తెలుగువారు చాలా తప్పు చేస్తున్నారు.

తాజా వార్తలు