రవితేజ ఎందుకు కమర్షియల్ సినిమాలే చేస్తున్నాడు...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.

ఇక ప్రస్తుతం రవితేజ కూడా అదే క్రేజ్ లో ఉన్నాడు.

ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో వరుస విజయలను అందుకోగా, రీసెంట్ గా ఆయన చేసిన టైగర్ నాగేశ్వరరావు ( Tiger Nageswara Rao )సినిమా అనుకున్న విజయాన్ని అందించలేదు.

దాంతో ఇప్పుడు ఆయన మళ్ళీ కొన్ని కొత్త కథలు వింటున్నట్టు గా తెలుస్తుంది.ఇక కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ లో ఈగల్ అనే సినిమా( Eagle ) చేస్తున్నప్పటికీ ఈ సినిమా సంక్రాంతి కానుకగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో చేయాల్సిన సినిమా మాత్రం ఆగిపోయింది.అది ఓవర్ బడ్జెట్ వల్ల ఆగిపోయింది.

ఇక దాంతో రవితేజ ఇప్పుడు ఏ సినిమా చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు.దాంతో ఇప్పుడు మళ్లీ ఇంకో సినిమా స్టార్ట్ చేయాలని రవితేజ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు.

Advertisement

ఇక అందులో భాగంగానే చాలామంది డైరెక్టర్లు చెప్పే కథలు వింటూ కొన్ని కథలను లాక్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రవితేజ కమర్షియల్ ఎంటర్ లాంటి సినిమాలు చేస్తేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో మళ్లీ కమర్షియల్ ఎంటర్ సినిమాలకే ఆయన మొగ్గు చూపుతున్నాడు ఎందుకంటే బయోగ్రఫీగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు సినిమా అనుకున్న విజయాన్ని అందించలేదు.ఇక అంతకుముందు ధమాకా సినిమా( Dhamaka ) కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా గా వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.

కాబట్టి అదే రూట్ లో వెళ్లడం మంచిది అని రవితేజ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక అందుకే రవితేజ మరో కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తున్నట్టు గా సమాచారం అందుతుంది.

ఇక రవితేజ వరుస సక్సెస్ లు కొడుతూ మళ్ళీ ముందుకు వెళ్లాలని కోరుకుందాం.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు